ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
14-06-2013 (Chapter-65)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
సంధ్యాజ్యోతి ఒళ్ళు విరుచుకుంది. గుటకలు మింగాడు నాంపల్లి. అతని వైపు చూసి "ఫస్ట్ టైమా? అని అడిగింది.
"ఏమిటి ఫస్ట్ టైం?" అయోమయంగా అడిగాడు.
"అమ్మాయిని చూడ్డం.." అంది.
కోపంగా సంధ్య వైపు చూసాడు. ఓ వైపు స్టీఫెన్, మెహతా, టెన్షన్ గా వున్నారు. ఈ అమ్మాయి ధైర్యం ఏమిటో అర్ధం కావడం లేదు.
"ఏంటీ అదోలా చూస్తున్నావు? మీ బాస్ ని పిలువు" గీరగా అంది సంధ్య.
మరో సమయంలో అయితే సీరియస్ గా రియాక్ట్ అయ్యేవాడు. ఇప్పుడున్న
పరిస్థితుల్లో కామ్ గా ఉండక తప్పడం లేదు. ప్రణవి తప్పించుకోవడం, మరియప్ప
చేతబడి ఎదురు తిరిగే పరిస్థితి రావడం...చంద్రహాస్ ఇంకా చావకపోవడం....
సంధ్య నాంపల్లి వైపు చూసి "ఇదిగో అబ్బాయి మాట" అంది.
అరికాలి మంట నెత్తికి ఎక్కింది. కోపం నషాళానికి తాకింది. అప్పటికప్పుడు
సంధ్య గొంతు పిసికి చంపేయాలన్నంత కోపమూ వచ్చింది. బలవంతాన కోపాన్ని
అణుచుకుంటూ...అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
*******************
నిక్శూచిని నిద్ర లేపి క్షుద్ర మాంత్రికుల చరిత్రలో నిక్శూచిని నిద్ర
లేపిన ఘనత సాధించాలని కలలు కన్నాడు మరియప్ప. ఆ కలలు కల్లలు కాబుతునాయని
తెలిసినప్పుడు కలిగే కోపం, అసహనం..వాటికి తోడూ భయం అన్నీ ఒకే సారి కలిగాయి,
మరియప్పలో...
అతనికి సెంటిమెంట్స్ లేవు...ఈ ప్రపంచంలో మరియప్ప లాంటి
వాళ్ళు వున్నారు...మాంత్రికులుగా చెలామణి కాకపోయినా, మనుష్యుల రూపంలో వున్న
హిపొక్రైట్స్ ..
నిక్శూచి ఒక ఆకారం కాదు..గాల్లో కలిసిపోతుంది...వర్షంలో కలిసిపోతుంది. ప్రపంచమంతా వ్యాపిస్తుంది. తన దుష్ట ప్రభావాన్ని చూపిస్తుంది.
కార్తికేయ నిక్శూచి ఆగమనాన్ని అడ్డుకోవడమే కాదు..శాశ్వతంగా
దిగ్బంధించాలన్నంత పట్టుదలగా వున్నాడు. నిజానికి అతనికి ఇక్కడ జరుగుతున్నది
పూర్తిగా తెలియదు. అతని అనుభవం..విచక్షణ కొంత ఊహించగలిగింది .
మరియప్ప కోపంతో ఊగిపోయాడు...తన క్షుద్ర ప్రయోగం భంగం అవుతుందని అర్ధమయింది.
అప్పటికే కార్తికేయ తన చేతిలో వున్న కొమ్మతో మరియప్ప మీద దాడి చేసాడు,
మరియప్ప కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. తన శక్తిని ధారపోసి కార్తికేయను
తన చూపులతోనే రక్తం కక్కుకుని చనిపోయేలా చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే తన
శక్తులను నిక్శూచిని నిద్ర లేపడానికి, ఉపయోగించాడో ఆ క్షణమే అతను శక్తులు
కోల్పోయాడు. అంత కన్నా దారుణంగా తన జేవితాన్ని కోల్పోతున్నాడు ..
మరియప్ప ఏకాగ్రత దెబ్బ తిన్నది. క్షుద్ర ప్రయోగం ఎప్పుడైతే అసంపూర్తి
మిగులుతుందో, అసంతృప్తితో వున్న నిక్శూచి అ ప్రయోగాన్ని చేపట్టిన వ్యక్తిని
బలి తీసుకుంటుంది. మరియప్ప విషయంలోనూ అదే జరిగింది.
కార్తికేయ
చేతిలోని కొమ్మ మరియప్ప తల మీద పడింది బలంగా...ఆ వేగానికి మరియప్ప పళ్ళు
రక్తంతో సహా కింద పడ్డాయి. ఎంత వేగంగా నిక్శూచి పైకి వచ్చిందో...అంతే
వేగంగా వెనక్కి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ,మరియప్పను బలి తీసుకుంది. ఒక్క
సారిగా ప్రేతాత్మలు దాడి చేసినట్టు...ముందుకు తూలి పడిపోయాడు. ప్రేతాలు
చుట్టుముట్టాయి....క్షణాల్లో రంగు మారుతూ...రక్తం భళ్ళున
కక్కుకున్నాడు...తల పక్కకు వాలింది.
అతని భార్య ఆత్మ సంతోషించింది,
*******************
ఒక ఘోర విధ్వంసం తప్పిపోయింది. చెడుకు బాసటగా వుంది, క్షుద్రమైన
చేతలతో..విర్ర వీగిన మాంత్రిక జాతిలోని చిట్టా చివరి వాడి జీవితం క్షుద్ర
ప్రేతాల దాడిలో ముగిసిపోయింది. నిక్శూచి అసంతృప్తితో మళ్ళీ సమాధుల అడుగు
పొరల్లోకి వెళ్ళిపోయింది.
ఒక క్షుద్ర మాంత్రికుడి జీవతం ఆ విధంగా అంతమైంది.
***************
ప్రణవి కళ్ళు తెరిచింది.తను ఎక్కడుంది? ఒక్క క్షణం అయోమయంగా చూసింది.తను ఎవరింటిలో వుంది ?
*************
(గతం గుర్తొచ్చిన ప్రణవి...వర్తమానం మర్చిపోయిందా? రేపటి సంచికలో)
No comments:
Post a Comment