ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 25 June 2013

1) జీవితం రైలు ప్రయాణం లాంటిదైతే వచ్చే జనం దిగే జనం, వచ్చే స్టేషన్ పోయే స్టేషన్ లాంటివి మనకు తారస పడే మిత్రులు, మన గమ్యస్థానం చేరేలోపు వచ్చే మజిలీలు.. కాకపొతే తెలియాల్సింది ఒకతీ.. సంతోషం అన్నది మనం చేరే గమ్యం కాదు అది ఒక ప్రయాణ విధానం.

2) ఉబుసుపోలు కబుర్లు చెప్పేవాళ్ళు ఎంచుకున్న ధ్యేయం పట్ల నిబద్దతతో క్రియలు సలపక జీవితంలో ఊరట చెందలేరు, విజయం అందలేరు. మాటలు నీటి బుడగలు లాంటివి వాటికి బదులు చేతలు బంగారు మూటలవుతాయి.
..................
విసురజ

(P.S... ఆలోచించకుండా మాట్లాడడం గురి చూడకుండా బాణం వెయ్యడం లాంటిది, తక్కువ మాట్లాడటం నేర్వండి, విజయం తరించండి)

No comments: