1) పరిమళం లేని
పూవు, మనసు లేని మనువు, నిలకడ లేని చదువు, హద్దులు లేని చనువు ..వీటితో
లాభం వుండదు. పైగా తగువులు తంటాలు మొదలవ్వే. హితులారా తెలిసి మెలగండి
తెలివి మీరండి.
2) మనసులో బాధ ఉంచుకుని పైకి సంతోషం వ్యక్తం చేయడం
సామాన్య విషయం కాకపోయినా చెప్పుకోదగ్గ విషయమే. కాకపోతే ఆచరణ యోగ్యమా కాదా
అన్నది పరిస్థితులు బట్టి తెలియగలవు, తెలిస్తేనే మనగలవు.. బ్రతుకు పీడగా,
జీవనం బరువుగా వున్నప్పుడే సంయమనం పాటించాలి, అప్పుడే మెలుకువగా వుండాలి,
కారణం ఎప్పుడు ఏ అదృష్ట దేవత కరుణిస్తిందో..
(P.S... నిర్భీతిగా, నిజాయితీతో జీవనం సాగించగలిగితే, బ్రతుకు గెలుపు మార్గం పట్టినట్టే.)
No comments:
Post a Comment