ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
05-06-2013 (Chapter-56)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
మండుటెండల్లో మంచు వర్షం కురిసిన ఫీలింగ్ ...ఎవరతను...తనను స్పృశించిన ఆ స్పర్శ ఎవరిది? తన జ్ఞాపకాల అరను తరచి తరచి ప్రశ్నోస్తోంది? సమాధానం లేదే ...రాత్రి పీడ కల..ఇప్పుడీ మధుర జ్ఞాపకం...ఏమిటీ వైరుధ్యం? ఏమిటీ విచిత్రం? ఏదో గుర్తు చేసుకోవాలనే ప్రయత్నం...కానీ గుర్తుకు రాని దైన్యం. దూరం నుంచి ఇదంతా గమనిస్తోన్న ముగ్ధకు బాధేసింది. ఒక్క క్షణం వెళ్లి "నువ్వు ప్రణవివి...ది గ్రేట్ చంద్రహాస్ భార్యవి" అని చెప్పాలని వుంది. కానీ పరిస్థితులు చెప్పనివ్వడం లేదు.
**************
సెక్యూరిటీ చీఫ్ మెహతా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. స్టీఫెన్ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. చంద్రహాస్ స్టీఫెన్ కస్టడీలో వున్నట్టు తెలిసింది. తనకు భారీగానే ముడుతుంది. ఇన్నాళ్ళు స్టీఫెన్ తరపున పని చేస్తూ వచ్చాడు. అతను చెప్పినట్టు వింటూ వచ్చాడు.
అంగరక్షకులు ఎవరిని కాపాడాలో వారినే బలి తీసుకున్న దేశంలో, ఒక ఇందిరాగాంధీ నేలకు ఒరిగిన కర్మభూమిలో గజానికో మెహతాలు...సిద్ధంగానే వుంటారు. అంతఃపుర రహస్యాలు మరణ శాసనాలు అవుతాయి.
చంద్రహాస్ ని ఫినిష్ చేసే తలారి పని నాంపల్లికి అప్పగించాడు స్టీఫెన్...మరో పక్క మరియప్ప క్షుద్రప్రయోగం...ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, స్టీఫెన్ వేసిన స్కెచ్ యిది. ఇప్పుడు తన పాత్ర అంతఃపుర రహస్యాలు చేధించాలి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ సేకరించాలి. అన్నింటికన్నా ముందు చంద్రహాస్ కనిపించడం లేదన్న విషయాన్ని ఫోకస్ చేయాలి...అదే సమయంలో చంద్రహాస్ భార్యని వెతుకుతూ వైజాగ్ వెళ్లి అక్కడ పిచ్చివాడుగా మారాడన్న ప్రచారం చేయాలి.
ఆర్ధిక మూలాలు దెబ్బతీయలి.
చంద్రహాస్ తన ఆస్తులకు ఏకైక వారసురాలిగా ప్రణవిని నియమించాడు. ఈలోగా ప్రణవిని ట్రేస్ చేయాలి. దీనితో పాటు తను చేయవలిసిన మరో ముఖ్యమైన పని ఒకటుంది.
డాక్టర్ చతుర్వేదిని చంపేయాలి...
ఇలాంటి కుట్రలు...ఆర్ధిక ప్రపంచంలో, వ్యాపార ప్రపంచంలో వెలుగు చూడని చేదు నిజాలు.
********************
సంధ్యాజ్యోతి సెక్యూరిటీ ఆఫీసులోకి వచ్చింది. నానా హంగామా చేసింది. చివరికి సెక్యూరిటీ అతి కష్టమ్మీద సంధ్యని చేతుల మీద ఎత్తుకుని సెక్యూరిటీ చీఫ్ మెహతా ముందు నిలబెట్టారు.
"మేడం...ఏమిటీ న్యూ సెన్స్ ...మీ మీడియా వాళ్ళు ఇలా చేయవచ్చా? అంతకు ముందు సంధ్యను చూసిన గుర్తు...పొలయిట్ గా అడిగాడు.
"మీ సెక్యూరిటీ గార్డ్ నాకు కన్ను కొట్టాడు...ఆఫ్ కోర్స్ నేను అందంగా వుంటాను...అంత మాత్రం చేత ఎంత అందంగా వుంటే మటుకు కన్ను కొట్టడమేనా? " డాభాయించి అడిగింది సంధ్య.
షాకయ్యాడు మెహతా...సెక్యూరిటీ గార్డ్ వంక చూసాడు.
"చ చ యితను కాదు...బయట నల్లగా, బొగ్గు స్కామ్ లో నిండా మునిగిన వాడిలా ఉంటాడే అతను..." అంది.
మెహతా మరోసారి షాకయ్యాడు. ఎందుకంటే అతను సెక్యూరిటీ గార్డ్ కాదు. ఎవరికీ అనుమానం రాకుండా సెక్యూరిటీ గార్డ్ వేషంలో వచ్చిన నాంపల్లి.
ఓ సారి సంధ్య వైపు చూసాడు...ఆమె మెహతా వైపు చూసింది. అతనికి అర్ధమైంది. అతను సంధ్యను తక్కువగా అంచనా వేసాడు. అంటే...సంధ్య కావాలనే...
"చూడండి మిస్టర్ మెహతా ...అతను ఇంకా హాలులో నుంచి నా వైపే మిర్రి మిర్రి చూస్తున్నాడు..నేను ఈ విషయం వెంటనే చంద్రహాస్ గారికి చెప్పాలి. నాకు చంద్రహాస్ గారి అప్పాయింట్మెంట్ కావాలి అంది సంధ్య.
"సర్ లేరు ...మేడం మీరు వెళ్ళండి...ఆ సెక్యూరిటీ గార్డ్ ని నేను మందలిస్తాను." మెహతా నచ్చచెప్పబోయాడు.
"వాడిని వదిలిపెట్టను...రేపు నా వెంట పడితే...నేను బస్సులో వెళ్ళగలనా? అసలే క్రైమ్ రేటింగ్ పెరిగిపోయింది. పోనీ ఓ పని చేస్తాను...అతడి ఫోటో తీసుకుంటాను. మా మేన్ రోబోలో అతడి ఫోటో పెడతాను. ఫ్యూచర్ లో పనికి వస్తుంది, లేదా వీరి వీరి గుమ్మడి కాయ.. వీరి పేరు నాంపల్లి ...వీరికి ఇక్కడ ఏం పని? అని కాప్షన్ రాసి" గుర్తు పట్టిన వారికి నాంపల్లి చేతుల మీదుగా ఒక హత్య ఫ్రీ అని" పెడదాం బావుంటుంది, మరి బహుమతిని స్పాన్సర్ చేసిన వారు స్టీఫెన్
గ్రూప్ అని కూడా పెట్టవచ్చు." మెహతా వంక చూసి అంది.
మెహతాకు అర్ధమైంది. సంధ్యాజ్యోతి అన్నీ తెలుసుకునే వచ్చింది. జర్నలిస్ట్ అంటే మొదటి సారి భయం కలిగింది, అతనికి. ఆమెను మామూలు ఆడపిల్ల అనుకున్నాడు. ఏవో ప్రెస్ నోట్స్ రాసుకుంటుంది అనుకున్నాడు. కానీ సూక్ష్మ రూపంలో వుండే అతి శక్తివంతమైన బాంబ్ అని ఇప్పుడు తెలిసింది.
"మీకు ఎంత కావాలి? అడిగాడు మెహతా..
"దట్స్ గుడ్...మీరు వెరీ స్మార్ట్ ...ఏడు..నా లక్కీ నంబర్కు ఒకటి ప్లస్ చేసాను .." చెప్పింది సంధ్య
"సెవెన్ ...ఏడు లక్షలా ?
"కాదు.."
"మరి కోట్లా.." షాకై అడిగాడు మెహతా...
అతను ఇంకా షాకయ్యేలా చెప్పింది సంధ్య.
****************
(అదేమిటో గెస్ చేయగలిగితే ఈ రోజు రాత్రి పన్నెండులోగా చెప్పవచ్చు..లేదా రేపటి సంచిక చూడవచ్చు ...సస్పెన్స్ to be continued ...)

No comments: