ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

1) ప్రవాహంలో కొట్టుకుపోతున్నవానికి చిన్న ఊత లభించినా అదే ప్రాణాధారం అవుతుంది. సమస్యల వలయంలో చిక్కుకున్నవానికి వాటిలోంచి కాస్త వెసులుబాటు దొరికినా ప్రాణం లేచివచ్చినట్టు వుంటుంది. అలాగే అందరి జనానికి ఈ జగంలో రోజులు ఎప్పుడు ఒకేలా వుండవు. ఇది తెలిసి, మరవక వీలైనంత సాయాన్ని కోరిన వారందరికి అందిస్తూ జీవనం సాగించాలి. నెరిపిన మిత్రత్వంతో అవసరమైతే నీ వెనుక నేనున్నంటు నిలబడే మిత్రులను సంపాదించుకోవాలి.

2) ఖరీదు కట్టే తత్వం మానుకో, అన్నిటికి డబ్బే 'సొల్యూషన్' అనే విధానం మర్చిపో. ప్రేమానురాగాలపై అధికార దర్పాలు, ఆడంబర అట్టహాసాలు ఒత్తిడి చేయలేవని తెలుసుకో. ఈ డాంబిక తత్వం మానకపోతే పూవైన నవ్వైన నీ కోసం పూయదని అర్ధం చేసుకో. ఆత్మీయ పరిమళాలు సుగంధాలు విరజిమ్మాలంటే స్నేహపూరిత వాతావరణం విలసిల్లాలి. అందుకే స్నేహమనే విత్తు నాటి మిత్రత్వం అనే చెట్టు పెరిగి పెద్దదైనాక అందిచ్చే మధుర ఆత్మీయ ఫలాలను రుచి చూసి మైమరవాలి. అంతకు మించి జీవిత సార్ధకత మరోటి లేదు.

(P.S..అందరిని ప్రేమించే మనసు అద్దంలా తళ తళ మెరుస్తూ అందిరిలో ప్రత్యేకంగా నిలుస్తుంది)

No comments: