ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
19-06-2013 (chapter-70)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
*****************
చివరి భాగం ...
ఒళ్ళు గగుర్పొడిచే సాహసం...
హెలికాప్టర్ ఆ బిల్డింగ్ మీదుగా ఎగురుతోంది. నిచ్చెన లాంటి సాధనం
ద్వారా మోహన దిగుతోంది. సాయుధులైన మాఫియా ఊహించని పరిణామం .ఆకాశం నుంచి
ఆదిశక్తి దిగివస్తున్నట్టు వుంది. ఇంకా పది అడుగుల దూరం ఉండగానే కిందికి
దూకేసింది.అప్పటికే మాఫియా చుట్టూ ముట్టింది.
*******************
స్టీఫెన్ తన ఎదురుగా వున్నా మోహన వైపు చూసాడు.ఒక్క క్షణం అతని ఒళ్ళు
జలదరించింది.మృత్యువు ఎదురుగా నిలబడిన ఫీలింగ్ కలిగింది.అతనికి మోహన
గురించి తెలుసు.మోహన ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలుసు.
"మిస్టర్
స్టీఫెన్ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను.ఒకటి వాళ్ళని వదిలేసి
వెళ్ళిపో...నువ్వు సరెండర్ అవుతావో.లేదో నాకు అనవసరం..నేను వీళ్ళను
తీసుకుని వెళ్ళిపోతాను.రెండు నువ్వు చచ్చిపో...నిన్ను ప్రాణాలతో
ప్రభుత్వానికి అప్పగించే ఇంట్రెస్ట్ నాకు లేదు..టైం వేస్ట్ ప్రాసెస్ .
రెండింటిలో నీ ఛాయస్ ఏదో ఆలోచించుకుని చెప్పు. మరో విషయం నిన్ను వదిలి
పెట్టినా, వీళ్ళను వదిలిపెట్టను. ఆలోచించుకో...ఈ లోగా నేను వీళ్ళతో
మాట్లాడుతాను."అంటూ ముగ్ధ దగ్గరికి వచ్చింది.
"ఒకప్పుడు తను కిడ్నాప్
చేయించిన ముగ్ధ..".కాలం ఎంత విచిత్రమైంది. ప్రణవి వంక ,సంధ్య వంక చూసి
పలకరింపుగా నవ్వింది.సివంగిలా కనిపిస్తోంది మోహన వాళ్ళకు.
*************
స్టీఫెన్ వంక చూస్తున్నారు సాయుధులైన మాఫియా మనుష్యులు. స్టీఫెన్ ఒక
విధంగా ఆత్మా రక్షణలో పడ్డాడు.మెహతా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడన్న వార్త
క్షణం క్రితమే తెలిసింది.చంద్రహాస్ సేఫ్ గా ఉండడమే కాక భయంకరమైన మాఫియా
గ్రూప్ ని ఫినిష్ చేసాడు.ఆనవాళ్ళు లేకుండా చేసాడు. ఏ క్షణమైనా చంద్రహాస్
,కార్తికేయ రావచ్చు.అప్పుడు వాళ్ళని ఆపడం ఎవరి తరమూ కాదు.
అతని ఛాయస్ వాళ్లకు అర్ధమైంది.వాళ్ళ ఛాయస్ మోహన కూ అర్ధమైంది.తాపీగా లేచింది.
"ఈ సృష్టిలో త్రిమూర్తులు వున్నారు.అలాంటి త్రిమూర్తులకు స్ఫూర్తిని
ఇచ్చిన స్త్రీమూర్తులకు ప్రతీకలైన ఈ స్త్రీమూర్తులను బందించావు.అందుకే
ఆదిశక్తినై వచ్చాను. మిమల్ని ఫినిష్ చేయడానికి ఈ పిడికిలి లో వున్న
కాన్ఫిడెంట్ చాలు."అంటూ చేతికి వున్న వాచీ వంక చూసింది. దానికి వున్న కీ
రాడ్ లాగి నేలకేసి కొట్టింది.చిన్న శబ్దం.ఆ తర్వాత పొగ...
కొద్ది క్షణాల తర్వాత చూస్తే ,ప్రణవి,ముగ్ధ,సంధ్య అక్కడ లేరు.మోహన మాత్రం వుంది.
***********
"ఈ యుద్ధం లో వాళ్ళ అవసరం లేదు.అయిదే నిమిషాల్లో ఫినిష్..."అంటూ బెల్ట్ లో
వున్న పదునైన డాగర్ తీసింది. గాలిలా కదిలింది.సుడిగాలిలా చెలరేగింది.ఒకే
ఒక నిమిషంలో నలుగురి కుత్తుకలు తెగిపోయాయి.అంటా షాక్ లో ఉండగానే మరో ఇద్దరు
నేలకొరిగారు. అప్పటికే మోహన సూచన మేరకు ఆ పరిసర ప్రాంతాల్లో వుండే
వారిని ఖాళీ చేయించారు పోలీసులు. మోహన కిచెన్ లోకి వెళ్ళింది.దాదాపు
వందకు పైగా సిలిండర్లు. స్టవ్ కు వున్న రెగ్యులేటర్ పీకి పారేసింది. బయటకు
పరుగెత్తింది.మోహన ఎందుకు లోపలి వెళ్ళింది వాళ్లకు అర్ధమయ్యేలోగా ,మోహన
బుల్లెట్ పేల్చింది కిచెన్ వైపు గురి చూసి.
పెద్ద శబ్దం...చాలా సింపుల్
గా...యుద్ధం ముగిసింది.చాలా ఘోరంగా వాళ్ళ చావు రాసిపెట్టి వుంది.అవయవాలు
గుర్తు పట్టడానికి వీల్లేకుండా...ప్రాణం లేని కరెన్సీ కోసం ,మనుష్యుల
ప్రాణాలు తీసే స్టీఫెన్,నాంపల్లి లాంటి వాళ్ళు .మాఫియా నామరూపాలు లేకుండా
ఫినిష్ అయింది.ఆ మంటల్లో మోహన రూపం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది.
భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే వాత్రిని ఏరిపారేయడానికి
కార్తికేయ సూచనతో రాష్ట్రపతి ద్వారా ప్రత్యేకంగా నియమించబడిన రక్షకురాలు
మోహన.
********************
ప్రణవి ,చంద్రహాస్..ఇద్దరి మధ్య నిశ్శబ్దం....వేన వేల భావాలను,కమ్యూనికేట్
చేస్తూ....అతని కౌగిలిలో ఒదిగిపోయింది.కన్నీటితో అతని గుండె ని
తడిపేసింది.
కార్తికేయ,ముగ్ధ ఘనంగా వీడ్కోలు పలికారు. కార్తికేయ మోహన కు ఫోన్ చేసి థాంక్స్ చెప్పాడు.
"నిన్ను కలవకుండా వెళ్తున్నందుకు మన్నించు మిత్రమా...నా ప్రాణాన్ని విడిచి
వెళ్తున్నాను.మళ్ళీ ఎపుడో నీ మాట కోసం ఎదురుచూస్తాను వుంటాను " మోహన
గొంతులో ఉగ్విగ్నత.
**************
చంద్రహాస్ గుండె మీద తల పెట్టింది ప్రణవి.ఆమె కు మాటలు రావడం లేదు.ఎన్నో
మాట్లాడాలని వుంది.ఎన్నో చెప్పాలని వుంది.ఆమె మనసును పసిగట్టిన అతని
అంతరంగం ..అతని చేతులకు,చేతలకు ఆ విషయాన్నీ చేరవేసింది.
ప్రణవిని
చుట్టేసాడు చ్చంద్రహాస్...ఒక స్పర్శ ఎన్నో కోటానుకోట్ల ఫీలింగ్స్
ని,విరహాలను,దూరాలను కలుపుతూ ,కలిసిపోతూ ,మధురోహాలను కానుకగా అందిస్తూ..
ప్రణవి చంద్రహాస్ కౌగిలిలో ఒదిగిపోయింది...కరిగిపోయింది..కలిసి ఒకే శరీరంగా మారిపోయింది
********************
*******ఈ సీరియల్ అయిపొయింది..కానీ మీ మనసు పొరల్లో నిలిచే వుంటుంది ******
రచయిత విసురజ చివరిమాట
_____________________
ఒక అక్షరాన్ని ఆహ్వానించి మరో అక్షరంతో అనుసంధానించి, సమాగింపచేసి పదంగా
మార్చి వాక్యంగా మలిచి శిల్పమనే కథనాన్ని చదువరుల మస్తిష్కపు కాన్వాసు పై
పరిచినప్పుడు ....మనో అశ్వవేగాన్ని అధిగమించి కథా కథన వేగంచే ఊపిరి
పోసుకున్ననవలా పాత్రలు మీ ఆదరణలో... ధన్యమైన వేళ......
ఆగష్టు 1 సీరియల్ కు లిఖించా ఈ చివరి మాట....
కేవలం హీరోయిజాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఒకే ప్రాణంగా బ్రతికిన
రెండు దేహాలు...విడిపోతే పడే ఆవేదన, తపన ఆపై ఒకరికై ఒకరు పరితపించి
కొనసాగించిన నిరంతర అన్వేషణ. ప్రణవి చంద్రహాస్ ల మధ్య వున్న అనుబంధం...తన
ప్రాణం ..ఇక లేదని తెలియబరచినా నమ్మని వైనం ఆ నమ్మకం...సర్వాన్ని, తన
సమస్తాన్ని వదిలి ఆమె కోసం కొనసాగిన అతని అన్వేషణ...ప్రేమను కొత్త కోణంలో
చూపించాలనే నా ప్రయత్నానికి తొలి అడుగు. రాధాచంద్రిక పాత్రలోని ఆర్ద్రత,
సాత్యకి పాత్ర ఔన్నత్యం, విశాల హృదయం, ప్రణవి ,చంద్రహాస్ ల చుట్టూ
అల్లుకున్న అందమైన తనూలతలు ...చివరికి మరియప్ప భార్య ఆత్మతో సహా . ..
స్టీఫెన్ లాంటి స్వార్ధపరుడు, నాంపల్లి లాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్,
మెహతా లాంటి నమ్మకద్రోహి, మరియప్ప లాంటి క్షుద్రమాంత్రికుడు . .ఈ వ్యవస్థలో
చీడ పురుగులు....ఇలాంటి వాళ్ళని ఏరి పారేయడానికి, ప్రతి ఒక్కరు అంటే మీరే
ఒక 'కార్తికేయ' కావాలి. ఒక చంద్రహాస్ కావాలి.
ప్రతి వ్యక్తిలోనూ ఒక
వ్యక్తిత్వం వుంటుంది. అది పాజిటివ్ గా వుంటే ఎనర్జీ అవుతుంది లేదంటే
భస్మాసుర హస్తం అవుతుంది. మన ఉనికిని కోల్పోయేలా చేస్తుంది.
అందుకు ఈ ఆగష్టు 1....ఒక దృష్టాంతరం ఒక ఉదాహరణ కావాలని రాసిన రచన, చేసిన ప్రయత్నం యిది.
మీ అభినందన వ్యాక్యముల నిర్మాణమే నా అక్షరాలకు అమృతమనే సిరా, నేను
ఎంచుకున్న మార్గం మంచిదన్న భావసౌలభ్యం అలాగే అంబరమంటే ఆత్మావిశ్వాసం
అవుతుంది.
ఎప్పటికీ
మీ
విసురజ
No comments:
Post a Comment