1)
చీకటివెలుగులు, సుఖదుఃఖాలు, కష్టసుఖాలు, ఎగుడుదిగుడులు, లాభనష్టాలు యివన్నీ
ద్వంద్వ పదాలే కాదు పరస్పర విరుద్ద భావాలు. కాకపోతే వీటిలో ఒకటి తెలిస్తే
కాని మరోటి అనుభూతి అవ్వదు. అయినా ప్రతి మనిషి జీవితంలో యియ్యన్నీ తప్పక
పలకరించి తమ రంగులు అద్ది తీరుతాయి.
2) నిజాలు నిక్కచ్చిగా చెప్పినా ఒక్కోసారి మనసుకు బాధ కలుగుతుంది. అసలు నిజాలే చెప్పకపోతే బ్రతుకు హీనమవుతుంది. చెప్పల్సిన విషయాన్ని నిఖార్సైన నిజమైనా చెప్పే తీరుతో సమయం సందర్భం గమనిస్తూ చెప్పాలి, అలాగే కావాల్సిన విజ్ఞ్యత చూపాలి.
(P.S. కష్టాల్లోనే కటిక నిజాలు బోధ పడుతుంటాయి, అందుకే కష్టాలని మేలుచేసే మిత్రులుగా గుర్తించండి)

No comments:
Post a Comment