కవిత: ఎద వ్యధ
...................
ఎందుకంత ఊరికూరికే నవ్వుతావు మనోహరి
మనుసులోనోకటిగా పైకి మరోలా ఎందుకు నటిస్తున్నావు వయ్యారి
కంటిలో సన్నని తడి మరి పెదవులపై శుష్క దరహాసమేమిటి
అసలు నిజమేమిటి మనసు దాచి నీవు చూపుతున్నదేమిటి
పరిపరిమార్లు ఎందుకిలా మనసుని ఏమార్చుకుంటున్నావేమిటి
చెంపలపై జాలువారే కన్నీళ్లను దాచి గొంతులోకే మింగితే మనసా
మింగిన కన్నీళ్ళే బ్రతుకును బుగ్గిచేయు కాలకూట విషమవ్వే తెలుసా
మదిలోని మమతను దాచి మనసును ఏమార్చిన వైనం దాగేనా
చేతిరేఖలపై చింతలేలా చితిలోనవి కాలకమానేనా చెలి
నొసటి గీతల కన్నా క్రియ కర్మలే గొప్పవని 'గీత'లో చెప్పలేదామరి
మరి రేఖలపై రాతలపై గీతాలపై గొణుక్కోవడమేమిటే వెర్రి మనసా
నిన్నలో బ్రతికేవు పాత గాయాల్ని ఊరికే కెలికేవు పిచ్చి మనసా
నేడులో నిలిచి మిన్నగా బ్రతకితే మనిషిగా గెలిచేవు నిజమిది తెలుసా
ఎదను తడుముకో మనసు తెలుసుకో గతం మరిచిపో వలపు అందుకోవే ప్రియ మనసా

.....
విసురజ

No comments:
Post a Comment