1) ఉదయపు
వెలుగులలో, అనుకూల పరిస్థితులలో తమ లక్ష్యం వైపు సాగి దాన్ని సాధించడం
విజయమవ్వే. కాకపోతే ప్రతికూల పరిస్థితులలో, మరుగులో, చీకటి నిశిలోనూ వెరవక
ఎన్నుకున్న లక్ష్యాన్ని చేధించడం, విజయం సాధించడాన్ని వీరత్వం కూడిన
దిగ్విజయంగా నమోదు కాబడుతుంది. కాదంటారా..
2) కాగితం పూలకి సెంట్
అద్దినా, అవి ఎంత అందంగా వున్నా సువాసనివ్వవు, సంపెంగల్ని చెత్తలో పడవేసిన
తమ సువాసన మరుగునపడనివ్వవు. కుక్క తోకని రాట కేసి బలంగా కట్టినా వంకర పోదు.
స్వయముగా అబ్బిన జాతి లక్షణాలు అంట తొందరగా సమసిపోవు..
(PS...మనసులో వున్న నిర్మలమైన ఆనందాన్ని తెలియక బయట ఎంత వెతికినా దొరకదు, అందిరాదు)
No comments:
Post a Comment