శుభారంభం
ఓం
శ్రీ సాయి నాథాయ నమః
జై షిర్డీ సాయినాధ
మొదటి అంకం
సాయిబాబా
జీవిత చరిత్ర
మున్ముందు విఘ్నరాజైన వినాయకుని స్మరించి ఈ రచనా వ్యాసంగంలో ఆటంకాలను తొలగించి యీ శ్రీ షిర్డీ సాయిబాబా కధా రచనా ప్రక్రియ జయప్రదముగా జరిగేటట్టు ప్రార్ధిస్తూ శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీ గణేశుడని, గణనాధుడని భావిస్తూ ముందుకు సాగే..
తరువాత శ్రీసరస్వతీదేవిని స్మరించి తననీ గ్రంథ రచనకు నమస్కరించుచు, శ్రీసాయినాధుడే సరస్వతి రూపై వారు తమ కథను తామే జనహితంకై వివరించేరు తరువాత సృష్టి, స్థితి, లయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపుమని వారే జీవులను సంసారమనే నదిని దాటిస్తారాని బలంగా నమ్ముతున్నా...
తరువాత నా కులధైవమగు వేంకటేశ్వరుని నమస్కరించా.. ఈ రచన బహు చక్కగా వచ్చేటట్టు దీవించమని, చేయూత ఇవ్వమని ప్రార్ధించా.. ఆపై గోత్రఋషి అయినా కశ్యపులా వారిని స్మరిస్తూ కశ్యపా గోత్రంలోని సప్తార్ష ఋషులను ఆశీర్వదించమని కోరా.. తరువాత నా పితామహుడైన సూర్యనారాయణ మూర్తి గారికి, స్వర్గీయ తండ్రి సుందర రావు గారికి, తండ్రి తరువాత తండ్రి అంతటివాడైన స్వర్గీయ ప్రసాదన్నయ్యకు (మా పెద్ద అన్నయ్య), అమ్మ రంగనాయకమ్మకు, మేనత్తకు ఇతర జ్యేష్టులైన అందరికి వందనాలు. అటుపైన పాఠక దేవుళ్ళకు నమస్కరాలు. ముఖ్యంగా ఈ గ్రంథ రచనకు కావాల్సిన ఏకాగ్రచిత్తమును సంతోషంగా రాయగలిగే శక్తిని ఇవ్వమని, కరుణించమని వీరందరిని వేడా...
చివరగా దత్తావతారమగు (నా ఇష్టదైవం/గురువు) శ్రీసాయిబాబాకు నమస్కరించి, నా రచనా శక్తి అంతా వారిపై పూర్తిగా ఆధారపడ్డానని చెప్పుచు, ఈ ప్రపంచం మిథ్యయని, బ్రహ్మమే సత్యమనే అనుభవాన్ని తెలిసే. సకల జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడని ఎంచి వారందరికి నమస్కరించెద.
యోగీశ్వరుల కర్తవ్యము
భగవద్గీత చతుర్థాధ్యాయమున 7, 8, శ్లోకములలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చే. "ధర్మము నశించునపుడు అధర్మము వృద్ధిపొందునపుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగ యుగములందు అవతరించెద". అటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఆ భగవంతుడు స్వయముగా వెంచేయవచ్చు లేనిచో దేవుని దూతలా ఆ భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించేదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునపుడు, మతము పేరుతో కాని పనులు చేయునపుడు, వేర్వేరు మతాలవారు తమలో తాము కలహించునపుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునపుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనపుడు, ప్రజల ధనధారసంతానాలే జీవిత పరమార్థముగా భావించినపుడు, యొగీశ్వరులు వుద్భవించి వారి మనో వాక్కాయ కర్మలచే భక్తులను/ప్రజలను సవ్య మార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దేదరు. యొగీశ్వరులు దీపపు స్తంభములలే సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనను నిర్దేసించేదరు. అట్లే యోగిరాజ్ భగవాన్ శ్రీ సాయిబాబా గూడ షిరిడీ చేరిరి.
షిరిడీ పుణ్యక్షేత్రము
అహమదునగరు జీల్లాలోని గోదావరి నది ప్రాంతాలలో వుంది షిర్డీ, ఒక చిన్న కుగ్రామం. షిరిడీ అహమదునగరు జిల్లాలోని కోపర్ గాం తాలూకాకు చెందినది. కోపర్ గాం వద్ద గోదావరి నదిని దాటి షిరిడీకి పోవలెను. నదిదాటి 3 కోసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించు. కృష్ణా తీరమందుగల గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగాగల పుణ్యక్షేత్రముల వలే షిరిడీకూడ గొప్పగా పేరు గాంచినది. అందరివాడైన శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
మొదటి అంకం సమాప్తం

No comments:
Post a Comment