ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

1) పరుగులు తీసే వయసులో జోరుండు...మంచి చెడులు ఎక్కువ ఆలోచించకుండు.. గెలుపుకై తాపత్రయం మెండుగా వుండు. కానీ వీటన్నిటితో పాటు విజ్ఞ్యత మరియు వినయం ఎవరు చూపునో, విజయం వారినే వరించుచుండు.

2) నడిచే నడక సక్రమముగా వుండి నడతకు నగుబాటు లేకుంటే, చూసే చూపు వక్రముగా లేకుంటే, పరుల ఎదుగుదలపై ఎదలో గుబులు లేకుంటే.. బ్రతుకు జైత్రయాత్రగ జగాన జనులు జేజేలు కొట్టేవిధముగా సాగునులే.


(ఈ రోజు మీరు ఎవరినీ బాధ పెట్టకూడదని నిర్ణయించుకోండి, మీతో సహా...)

No comments: