ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
29-05-2013 (Chapter-49)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ప్రపంచమంతా తనను పరిహసిస్తుందా? తనకు మతి భ్రమించిందా? ,,,,అ గదిలో వున్న వాళ్ళంతా పిచ్చివాళ్ళే ...తనకేమైంది?
తనకు నవ్వొస్తోంది? తన చుట్టూ పిచ్చివాళ్ళ ప్రపంచం....చీకటి ఆక్రమిస్తోంది...తన మెదడును ఏదో దుష్టశక్తి ఆక్రమిస్తోన్నట్టు....
ఏం జరుగుతోంది? తీతువు పిట్ట ఈ గదిలోకి వచ్చిందా? గుడ్లగూబలు ఇక్కడున మనుష్యుల్లోకి ఆవహించబడ్డారా? సూడో బ్లాక్ మేజిక్? తాంత్రిక శక్తి?
**************************
పాడుబడి ఎవరు తిరగాడని ఎవరికీ [పనికిరాక వదిలివేయబడ్డ శ్మశానం ...క్షుద్రమాంత్రికులు మాత్రమే ప్రవేశించడానికి సాహసించగల ప్రాంతం...
క్షుద్రప్రపంచంలో అతి తీవ్ర ప్రభావం చూపగల బిత్రోచి అనే దుష్టశక్తి కాపలా వున్న ప్రాంతం...కొన్న పదుల సంవత్సరాల క్రితం అక్కడ పాతిపెట్టబడిన శవాలతో క్షుద్రక్రతువు నిర్వహించి, ఆ శవాలలోని ప్రేతాత్మలను కాపలా పెట్టి బిత్రోచికి బలి ఇచ్చిన ప్రాంతం...
అర్హరాత్రి పన్నెండు కావడానికి ఒకే ఒక క్షణం బాకీ వుంది. వందల సంవత్సరాలుగా వున్న మర్రిచెట్టు...తన కొమ్మల్లో ప్రేతాత్మలకు ఆశ్రయమిచ్చినట్టు వుంది. పిచ్చి మొక్కలు పిచ్చి పట్టినట్టు వున్నాయి...గాలిలో ఏదో మార్పు...
సరిగ్గా ఒక్క క్షణం తర్వాత ఆ స్మశానంలోకి ప్రవేశించాడు అతడు...సంవత్సరాలుగా నిద్రలేనట్టు వున కళ్ళు ....అప్పుడే ప్రేతాత్మతో కలిసి నడిచి వస్తున్నట్టుగా .... మర్రిచెట్టుకు కాసింత దూరంలో వున్న సమాధి...పెచ్చులూడి పోయి వుంది...అతి పెద్ద సమాధి. ఒకేసారి పదమూడు మందిని పాతిపెట్టిన అతి పెద్ద సమాధి. ఆ సమాధి మీద రాయబడిన అక్షరాలు చీకటిలో కూడా మెరుస్తున్నట్టు....
బిత్రోచి నిద్రపోతున్న సమాది...ఆ సమాధిలో పదమూడు ప్రేతాత్మలతో నిద్రపోతోన్న బిత్రోచిని నిద్రలేపడానికి వచ్చిన ఆ తాంత్రికుడి పేరు...మరియప్ప...క్షుద్రమాంత్రికుల వంశంలో చిట్ట చివరివాడు...డెబ్భై సంవత్సరాల వయసున్న మరియప్ప ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఆ స్మశానంలోకి ప్రవేశించాడు.
బిత్రోచిని నిద్రలేపగల ఒకే ఒక మాంత్రికుడు...
ఆ స్మశానం చివర చంద్రహాస్ సెక్యూరిటీ చీఫ్ మెహతా పాతకాలం నాటి నల్ల రంగు కారులో కూచోని వున్నాడు. అతని పక్కనే స్టీఫెన్..రామతీర్థం...వున్నారు.
కొన్ని గంటల క్రితం...
రామతీర్థం ఓ క్షుద్రమంత్రికుడి దగరికి వెళ్ళినప్పుడు అతడు తన చేతబడి శక్తి చూపించాడు. చంద్రహాస్ మీద ప్రయోగించిన చేతబడి తిరిగికొట్టింది..ఆ రాత్రి కసికొద్దీ మళ్ళీ చేతబడిని ప్రయోగించాడు...
చేతబడి చంద్రహాస్ ని సమీపించే సమయంలో చంద్రహాస్ తన ఇష్టదైవమైన సాయి సమక్షంలో వున్నాడు.
కొద్ది క్షణాల వ్యవధిలో ఆ క్షుద్రమాంత్రికుడు రక్తం కక్కుకొని మరణించాడు. అతని శరీరం నలుపు వర్ణంలోకి మారింది. చనిపోవడానికి ముందు తనకు ఈ క్షుద్రవిద్యలను నేర్పిన మహా మాంత్రికుడు మరియప్పను చూడాలనుకున్నాడు.
మరియప్ప తన శిష్యుడి మరణానికి కారణమైన శక్తిని ఎదురించాలని అనుకున్నాడు...
అందుకే ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ స్మశానంలోకి ప్రవేశించాడు మరియప్ప.
చంద్రహాస్ పాదాలకు అంటిన మట్టి, చంద్రహాస్ ఫోటో మరియప్ప ఎదురుగా వున్నాయి.
***********************
ప్రణవి కళ్ళు మూసుకుని వుంది. డాక్టర్ సుందరరావు ప్రణవి ఎదురుగా వున్నాడు...
"నీకు నా మాటలు తప్ప మరేమీ వినిపించడం లేదు...నా మాటలు వింటున్నావు. గతాన్ని గుర్తు చేసుకుంటున్నావు..." ప్రణవిని ట్రాన్స్ లోకి పంపిస్తున్నాడు.
ప్రణవి మైండ్ లో కొన్ని రంగులు...రక రకాల రంగులు...జ్ఞాపకాలుగా మారే ప్రయత్నం చేస్తున్నట్టు...కానీ ఏమీ గుర్తుకు రావడం లేదు...
"నీ పేరేమిటి ?
"ఏమో..తెలియదు?
"నీ భర్త ఎక్కడుంటాడు?
సమాధానం లేదు...ఆమె పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి.
***********************
డాక్టర్ సుందరరావు కార్తికేయ వైపు చూసి చెప్పాడు."ఆ అమ్మాయికి గతం గుర్తుకురావడం లేదు...గుర్తు చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో అలిసి పోతుంది. ఆమెకు గతం గుర్తుకు వచ్చే అవకాశాలు తక్కువ"
కార్తికేయ డాక్టర్ వైపు చూసి, ఓకే డాక్టర్...కొంతకాలం నా దగ్గరే వుంటుంది. ఈ లోగా తనకు సంబంధించిన వారి కోసం వెతుకుతాను." చెప్పి బయటకు నడిచాడు.
గదిలో వీళ్ళ సంభాషణ విన్న ఓ వ్యక్తి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
**************
ఆ గదిలో కార్తికేయ, ముగ్ధ వున్నారు. పక్క గదిలో ప్రణవి నిద్రపోతుంది.
"పాపం ఆ అమ్మాయిని చూస్తోంటే బాధగా వుంది. తానెవరో తనకే తెలియకపోవడం ఎంత విషాదం..,అసలు ఆ అమ్మాయిని ఏ పేరుతొ పిలవాలి ?
"ప్రణవి అని పిలవాలి..." చెప్పాడు కార్తికేయ. ఆ అమ్మాయి బిజినెస్ టైకూన్ చంద్రహాస్ భార్య...మిసెస్ ప్రణవీ చంద్రహాస్..." చెప్పాడు కార్తికేయ....
***************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

No comments:
Post a Comment