ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

1) అందమైన తియ్యటి చిరునవ్వులు చిందిస్తూ చల్లగా మాట్లాడే మనిషి కార్యసాధకుడుగా నిలుస్తాడు. అలాగే అటువంటి మనిషితో ఎవరు ఇబ్బందిపడరు, బెట్టుచెయ్యరు, అవసరమైతే సర్దుకుపోతారు. అందుకే అంటారు, మంచిదైతే ఊరు మంచిదవుతుందని. తెలిసి మెలగండి, గెలుపు పొందండి.

2) ఎంచుకున్న లక్ష్యాన్ని ప్రేమించి, లక్ష్యసాధన దిశగా ముందుకు కదిలినప్పుడు, ఆ దారిలో అవరోధాలు అడ్డంకులు అధిగమించల్సి రావచ్చు. ముళ్ళు తాకకుండా గులాబీలు కోయగలుగుతామా అందుకే ఎన్నిన లక్ష్యం పట్ల అభిమానం వుంచుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు పెద్ద ఇబ్బంది పెట్టవు. పది మైళ్ళు నడవాలన్న మొట్టమొదట వేయాల్సింది తొలి అడుగే. సాహసించనదే ఏమి సాధించలేవు. 

(P.S. ... మనసులో భావం మారినప్పుడే భజన చేసేందుకు సార్ధకత లబిస్తుంది)

No comments: