ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
11-06-2013 (chapter-62)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ప్రణవి కళ్ళు అలసటతో మూతలు పడుతున్నాయి.మ్ప్ప్తలు పడుతోన్న కళ్ళు గతాన్ని అన్వేషిస్తున్నాయి.క్షణకాల మాత్రం....లిప్తకాలం...ఒక్కో జ్ఞాపకం ఆమె ముందుకు రావడం మొదలుపెట్టాయి. తాజ్ మహల్ దగ్గర ప్రమాదం...ఆ ప్రమాదంలో తనకు తీవ్రమైన గాయాలు కావడం స్పృహ తప్పడం ..కళ్ళు తెరిచి చూస్తే.. అంతా చీకటి.
**************
అంతా చీకటి...కళ్ళు చిట్లించి చూసింది.ఏమీ కనిపించడం లేదు...ఆమె కళ్ళు చంద్రహాస్ ను అన్వేషిస్తున్నాయి.తనకేమైంది అని ఆలోచించడం లేదు..తన చంద్రహాస్ కు ఏమైందో అన్న ఆదుర్దా ఆమెది.
శక్తిని కూడతీసుకుని లేచింది.కాళ్ళకు ఏదో అడ్డం పడింది.తూలి పడబోయింది.అప్పుడు వెలిగాయి లైట్లు...ఒక్క క్షణం ఆ లైట్ల వెలుతురు చూడలేక కళ్ళు మూసుకుంది.
*************
"గుడ్ మార్నింగ్ ప్రణవి మేడం..."
ఆ గొంతు ఎక్కడో విన్న జ్ఞాపకం...కళ్ళు తెరిచి చూసింది.ఎదురుగా మెహతా....తమ సెక్యూరిటీ చీఫ్...రోజూ ఉదయమే గుడ్ మార్నింగ్ చెప్పే మెహతా...
"మీరా ?"ఆమె గొంతులో ఆశ్చర్యం...
"యస్..మేడం...రోజూ ఉదయమే మీకు శుభోదయం చెప్పే మీ సెక్యూరిటీ చీఫ్ ని.."
"నేను నేను ఇక్కడ ఎందుకు వున్నాను...? సర్ ఎక్కడ వున్నారు ?"అయోమయంగా అడిగింది.
"మీరు కిడ్నాప్ చేయబడ్డారు..."కూల్ గా చెప్పు మెహతా .
"వాట్...?కోపం,ఆశ్చర్యం ...
"యస్ మేడం...యాక్సిడెంట్ లో మీరు చచ్చిపోయారని ది గ్రేట్ చంద్రహాస్ సర్ అనుకుంటున్నారు...బాడ్ లక్ మీరు బ్రతికి పోయారు..ఇప్పుడు మీరు వెళ్లి " నేను బ్రతికే వున్నానని చెబితే...మమ్మల్ని బ్రతకనిస్తారా?పైగా ఎంత కష్టపడి ప్లాన్ వేసాం ? అందుకే మీరు కొన్నాళ్ళు మా గెస్ట్ గా వుండండి.మీరు చనిపోయారని నిర్ధారించుకుని చేసుకుని చంద్రహాస్ సర్ వ్యాపారాన్ని వదిలి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు...మీకో విషయం తెలుసా ...ఇంకా మీరు బ్రతికే వున్నారని వెతుకుతున్నారు...పేపర్స్ లో టీవీ లలో ప్రకటనలు ఇస్తున్నారు.../అంటూ ఆ వేల్టి పత్రికలూ ప్రణవి ముందు పట్టాడు.
ప్రణవికి ఏడుపు తన్నుకు వస్తుంది.తను చనిపోయినా బావుండేది...తను లేకుండా భర్త బ్రతకగలడా ? సెక్యూరిటీ చీఫ్ ఎంత పని చేసాడు ? రాజ్యాలు కూలిపోవడానికి అంతః పురరహస్యలు శత్రువుల చేతికి చేరడానికి నమ్మిన వారి నమ్మకద్రోహమే అని ప్రత్యక్ష్యంగా చూస్తుంది.
తన భర్తను ఎదురుగా ఎదుర్కోలేక ఇలా దొంగదెబ్బ తీస్తున్నారని అర్ధమైంది.
ఒకటి...రెండు..మూడు రోజులు గడిచిపోతునాయి.
పత్రికలూ వస్తునాయి..టీవీ తన ముందరే వుంది. మర్యాదలకు లోటు లేదు...తనను అడ్డుపెట్టుకుని తన భర్తను సాధించాలని చూస్తున్నారు ...
దీని వెనుక వున్నది స్టీఫెన్ అని అర్థమైంది. తను ఇక్కడి నుంచి తప్పించుకు పోవాలి..ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా పర్లేదు.
****************
ఆ రోజూ అర్ధరాత్రి వేళ తప్పించుకుంది.ఆమెను వెంటాడింది మాఫియా....ఆ ప్రయత్నంలో తలకు తీవ్రమైన గాయం తగిలింది.హైదరాబాద్ ఎక్కే రైలు ఎక్కింది.వృద్ధుడి ద్వారా రక్షించబడింది.కానీ జ్ఞాపకాన్ని కోల్పోయింది.నవీన్,వినోద్ లు కాపాడారు.వృద్ధుడు ప్రణవి ని వైజాగ్ తీసుకువెళ్ళాడు...
ఆ తర్వాత తన గతాన్ని వెతుకుతూ బయల్దేరింది.గతం ఆమె ముందు నిలిచింది.తన పేరు ప్రణవి...తను మిసెస్ ప్రణవీచంద్రహాస్....
ఆ దేవుడి సమక్షంలో ప్రణవి కి తనెవరో తెలిసింది.
*******************
ఓ దాడిలో బందించబడి వుంది సంధ్యాజ్యోతి. స్టీఫెన్ సంధ్య వైపు చూసి "వెరీ స్మార్ట్ గర్ల్...ఈ మెహతా కే చెమటలు పట్టించావు...ఇది చాలా సెంటిమెంట్ ప్లేస్... ఇక్కడే ప్రణవి మేడం ని బంధించాను...ఆమె ఎస్కేప్ అయింది.ఇప్పుడు నీ వంతు..."నవ్వుతూ చెప్పాడు మెహతా...
"ప్చ్...నిన్ను చూస్తే జాలేస్తుంది మెహతా...బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ చినప్పుడే కొబ్బరి పచ్చడి అయింది...నీ సెంటిమెంట్ ఏడ్చినట్టు...నీకు మెంటల్ అన్నట్టు వుంది...ప్రణవి మేడం లా నేను తప్పించుకొను...ఫరే చేంజ్ నువ్వే ఇక్కడి నుంచి తప్పించుకునేలా చేస్తాను.ఎన్సుకంటే నేను ఎక్కడున్నానో...నువ్వు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువస్తున్నప్పుడు ఫాలో అయిన మా బాస్ కు తెలుసు...
********************
స్మశానంలో మరియప్ప ఏకాగ్రతను సాధించే ప్రయత్నంలో వున్నాడు.ఆలయంలో నుంచి వినిపించే గంటల ధ్వని వేన వేళ రెట్టిమ్పులతో అతని కర్ణ భేరిని బద్దలు కొట్టేలా వుంది.ఈ సమయంలో తను చివరి క్షణాన్ని విస్మరిస్తే ,తను ఘోరమైన చావును ఆహ్వానించవలిసివస్తుంది తన ఏకాగ్రతను దెబ్బ తీస్తున్నది ఎవరు ?అలాంటి ఆలోచన కూడా చేయకూడదు..నిక్శూచి చివరి దశలో వుంది.నిద్ర లేవడానికి క్షణాల వ్యవధి మాత్రమే..
*****************
చంద్రహాస్ శక్తిని,ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు."దేవుడా నువ్వు మనుష్యులను సృష్టించావు...ఆ మనుష్యులలో ఆత్మవిశ్వాసాన్ని సృష్టించావు...మాలో నువ్వు వున్నది నిజమైతే...నాకు శక్తిని ఇవ్వు...
కళ్ళు మూసుకున్నాడు చంద్రహాస్...
******************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ...)

No comments:
Post a Comment