ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
17-06-2013 (Chapter-68)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
కళ్ళు మూసుకుంది ప్రణవి...జరుగుతున్నది ఏమిటో కొద్ది కొద్దిగా
అర్ధమవుతోంది. చిత్రంగా అనిపిస్తోంది. తమను కిడ్నాప్ చేసి
తీసుకువెళ్తుంటే...ఇంత కూల్ గా వుండడం ఏమిటి? అయినా భయం వేయడం
లేదు....నిశ్చింత ....తమకు ఏమీ కాదు. కార్తికేయ వున్నారు...తన భర్త
చంద్రహాస్ వున్నాడు. తన పక్కనే ముగ్ధ వుంది. నాంపల్లి కి ఎక్కడో భయం
మొదలైంది. అతనికి కార్తికేయ గురించి బాగా తెలుసు. చంద్రహాస్ శక్తి
సామర్ధ్యాలు తెలుసు.
అతనికి ఎన్నో నేరాలతో సంబంధం వుంది. అతని మీద రౌడీ
షీట్ వుంది. అయితే అతని ఇలాంటి అనుభవం ఎదురవ్వడం మొదటి సారి. పైగా
ఒకప్పుడు ఉగ్రవాదులను ఏరిపారేసిన కార్తికేయతో, చంద్రహాస్ లాంటి వ్యక్తితో
వైరం...భయాన్ని కలిగిస్తుంది.
******************
స్టీఫెన్ కు క్షణ క్షణం టెన్షన్ పెరిగిపోతోంది. ఎదురుగా సంధ్యను చూస్తోంటే
మరింత ఇరిటేషన్ వస్తోంది. తన పునాదులు కదిలిపోతాయన్నంత భయం...
భయం
ప్రపంచంలో చావు కన్నా భయంకరమైనది. చావు ఒక్క సారే వస్తుంది ..భయం ఒక్క సారి
మొదలైందంటే అది మనల్ని వెన్నంటి వుంటుంది .అనుక్షణం బౌతికంగా చంపకుండా
చావు రుచిని చూపిస్తుంది. .మనం దాన్ని శాశ్వతంగా తరిమేసేవరకూ...స్టీఫెన్ లో
భయం "తను తప్పు చేయడం వల్ల వచ్చింది."
మాటి మాటికి ఫోన్ చేస్తున్నాడు.
చంద్రహాస్ ను చంపడానికి ఒక గ్రూప్ వెళ్ళింది. మాఫియాకు సుపారీ ముట్టింది.
కార్తికేయను ఎదుర్కోవడానికి, అవసరమైతే అతడిని నిలువరించి బెదిరించడానికే
ముగ్ధ, ప్రణవిని కిడ్నాప్ చేయిస్తున్నాడు.
*******************
కార్తికేయ సిటి లిమిట్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. అపటికే కార్తికేయను
టార్గెట్ చేసిన మాఫియా గ్రూప్ అతడిని రౌండప్ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది.
కార్తికేయ డేగ కళ్ళు ఆ విషయాన్ని పసిగట్టాయి. ఈ పరిస్థితుల్లో తను
సిటీలోకి వెళ్ళడం క్షేమం కాదు. ఈ వార్ లో సామాన్య జనం బలికావడం ఇష్టం లేదు.
రెండు రోజుల క్రితమే అతనికి ఈ విషయం తెలిసింది. విదేశాల నుంచి మాఫియా
దిగుమతి అవుతోందన్నవిషయం. సుపారీ రూపంలో కరెన్సీ చేతులు మారిందన్న విషయం
అతని నోటీసుకు వచ్చింది. అతని చేతిలో వున్న టాబ్లెట్ కంప్యూటర్ ఆన్
అయింది. ఓ వైపు డ్రైవ్ చేస్తూనే డిటేల్స్ చెక్ చేస్తున్నాడు. ఇటలీ, యుఎస్,
చైనా ....మాఫియా లోని పెద్ద తలకాయలు వచ్చాయి. అందులో చాల మంది మీద "షూట్
ఎట్ సైట్ వుంది". కార్తికేయలో చిన్న అనుమానం....క్రమ క్రమంగా పెరిగి
పెద్దవ్వసాగింది. వెంటనే ఇంటికి చేసాడు. ల్యాండ్ ఫోన్ కు...రింగవుతోంది
కానీ లిఫ్ట్ చేయడం లేదు. అంటే తన అనుమానమే నిజమైంది. వాళ్ళని అడ్డు
పెట్టుకుని తమను టార్గెట్ చేయాలనీ. ఇలాంటి సమయంలో మాఫియా నుంచి ఎస్కేప్
అవ్వడం పెద్ద విషయం కాదు. తన భార్యను, ప్రణవిని కాపాడడం సమస్య కాదు.
కానీ ఈ ప్రయత్నంలో తను ఈ మాఫియాని వదిలివేయాలి. భారతదేశ ప్రశాంతతకు విఘాతం
కలిగిస్తూ ఎక్కడో వుంటూనే ఇక్కడ అల్లకల్లోలం సృష్టించే మాఫియాని తను ఫినిష్
చేయాలంటే...అక్కడ ముగ్ద, ప్రణవి, సంధ్యలను కాపాడేవాళ్ళు కావాలి. చంద్రహాస్
కోసం మరో మాఫియా గ్రూప్ వెళ్ళింది. అతి ప్రమాదకరమైన "జెడ్ "
మాఫియా...వాళ్ళని చంద్రహాస్ హేండిల్ చేయగలడు. ఇప్పుడు కావలిసినది ముగ్ధ,
ప్రణవి, సంధ్యలను కాపాడే వ్యక్తి...శక్తి....
ఎందుకంటే స్టీఫెన్ దగ్గర వున్న మాఫియా జాంబానియా గ్రూప్ ....ఏ మాత్రం మానవత్వం, భయం లేని క్రూరత్వం వున్న గ్రూప్...
ఈ సమయంలో అమాయక ఆడవాళ్ళను కాపాడే శక్తి వున్న ఒకే ఒక మహా అస్త్రం...సెల్ ఫోన్ లో ఓ నంబర్ డయల్ చేసాడు.
**************
రాజస్థాన్ ఎడారి...మిట్ట మధ్యాహ్నం ...ఒక్కసారిగా ఇసుక తుపాన్
చుట్టుముట్టింది. అయినా చెక్కు చెదరకుండా..ఒకే ఒక కాలు మీద నిలబడి వుంది
...మో...హ...న . ముగ్ధ మోహన ..
(రేపటి సంచికలో ఒక అద్భుతం)
No comments:
Post a Comment