1) సంశయాలు,
సందిగ్దాలు, భేదాలు, వాదాలు, చికాకులు, చీదరింపులు, రుసరుసలు ...యివన్నీ
సంసార జీవన సాఫల్య ఫలాలందే రాదారిలో ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లు/చీకట్లు ..
సంతోషాలు, సౌఖ్యాలు, సరదాలు, సరసాలు, సంబరాలు, సందడులు, స్వీట్
నథింగ్స్..... యివన్నీ సంసార జీవన సాఫల్య ఫలాలందే రాదారిలో సేద తీర్చి
మార్గ నిర్దేశం చేసే చిహ్నాల రాజప్రాసదాలు/వెలుగులు. ఎలాగైతే లోకానికి
చీకటి వల్లే వెలుగు విలువ తెలుస్తుందో అట్లాగే ఈ సంసార లోకంలో స్పీడ్
బ్రేకర్స్/చీకట్లు లేనిచో రాజప్రసదాల/వెలుగుల విలువ తెలిసిరాదు.
2) బ్రతుకు తెరువు పోరాటంలో కడుపు నింపే ఏ వృత్తి చిన్నది కాదు, దేని పట్ల
చిన్న చూపు కూడదు. అందరూ డాక్టర్స్, కంప్యూటర్ ఇంజనీర్స్, CAలు, ఆఫీసర్స్,
లాయర్స్ అయితే మిగతా వృత్తులకు ఎవరు న్యాయం చేస్తారు.. అందరూ పల్లకీ
ఎక్కేవారైతే మరి మోసే బోయలెవరు.. తండ్రులందరూ తమ అమ్మాయిలకు అమెరికా
సంబంధాలు, అత్యున్నత వాళ్ళు కావాలంటే కష్టమే కదా.. వృత్తి/వివాహం ఏదైనా
మనసైనది చేయడమే ఉత్తమం, తెలియగలరు.
......
విసురజ
(P.S. ...అన్నీ విధాల సంతోషంగా వుండే మనిషి అందరికన్నా ధనవంతుడు, బలవంతుడు.)
No comments:
Post a Comment