ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
30-05-2013 (Chapter-50)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
(ఈ అధ్యాయంలో చంద్రహాస్ జీవితంలో అసలు ఏం జరిగిందో తెలిపే..,కథలోని కీలకమైన మలుపు రావాలి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరి ద్వారా చెప్పించాలి? అన్న ఆలోచన కార్యరూపం దాల్చడానికి ముప్పయి ఆరు గంటలు పట్టింది. ప్రణవి ద్వారా, చంద్రహాస్ ద్వారా...కాకుండా కార్తికేయ ద్వారా చెప్పించే ఈ ప్రక్రియ....మీకూ నచ్చుతుందని నా నమ్మకం...ఎందుకంటే నా ప్రతీ అక్షరానికి స్ఫూర్తి ప్రదాతలు మీరే.... రచయిత)
"ప్రణవి...మిసెస్ ప్రణవీ చంద్రహాస్ .." విస్మయంగా అంది ముగ్ధ
"అవును...ప్రపంచమంతా అన్వేషిస్తోన్న ప్రణవి...మనల్ని చేరింది...తన ప్రాణాలు కాపాడమని మన కులదైవం శ్రీ వేంకటేశ్వరుడు పంపించాడు...తనని క్షేమంగా తన భర్త దగ్గరికి చేర్చమని మన ఇష్టదైవం ఆ సాయి మన దగ్గరికి చేర్చాడు ."
"ఆమె ప్రణవి
అని ,మీకెలా,ఎప్పుడు తెలిసింది?"
"చంద్రహాస్ నన్ను కలిసాడు.." ఒక విభ్రాంతికర విషయాన్ని చెప్పాడు.
ముగ్ధ ఆశ్చర్యంగా భర్త వంక చూసింది.
"అవును ముగ్ధా...చంద్రహాస్ వైజాగ్ కు వెళ్ళే ముందు నన్ను కలిసాడు. తన భార్య ప్రణవి కనిపించడం లేదని చెప్పాడు...తనకు మాఫియా నుంచి ప్రాణభయం ఉందనీ చెప్పాడు. కొనసాగించాడు కార్తికేయ...ముంబాయిలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను గుర్తుందా? అప్పుడు మనకు హెల్ప్ చేసింది చంద్రహాస్ గారే...అలా పరిచయం...అసలు జరిగింది ఏమిటో నీకు తెలియాలి....
రామాయణ మహా కావ్యం వాల్మీకి ద్వారా విరచితమైంది...పరమ పావనమైనది...
చంద్రహాస్ జీవితంలో జరిగిన ఓ ఘట్టం...కార్తికేయ ద్వారా తెలుస్తోంది.
"ఒక సెలబ్రిటీ జీవితంలో ఎదురైనా సంఘటన...వ్యాపార సామ్రాజ్యంలో శత్రువులు, ప్రత్యర్థులు, ఎలా వుంటారు? అసలు చంద్రహాస్ లాంటి బిజినెస్ టైకూన్ జేవితంలో ఎదురైనా విషాద సంఘటన...డబ్బు వున్నా వాళ్ళు హ్యాపీగా వుంటారు అనుకునే వారికి ఇది ఒక నిజమైన కథ...వ్యథ..."
కార్తికేయ ప్రణవి వున్న గది వైపు చూసాడు...అలిసి పోయి పడుకుంది. ముగ్ద వెళ్లి బెడ్ షీట్ కప్పి వచ్చింది. వచ్చే ముందు తలుపు దగ్గరగా వేసింది.
కార్తికేయ చెప్పడం మొదలుపెట్టాడు...ఎదురుగా టేబుల్ మీద వాల్మీకి రామాయణం వుంది.
"సీతా సాధ్వి బంగారు లేడీ అడిగిందో లేదో తెలియదు కానీ ప్రణవి తన భర్తను ఓ కోరిక కోరింది.. అదీ తన భర్త పుట్టిన రోజైన...
ఆగష్టు 1 రోజున....
********************
అదే సమయంలో మరియప్ప స్మశానంలో క్షుద్రక్రతువు నిర్వహిస్తున్నాడు...దెయ్యం వున్న చోటు దేవుడు ఉంటాడు...దేవుడిని నమ్మినప్పుడు దెయ్యాలు దేవుడి ఉనికిని నిర్వీర్యం చేయాలనే వ్యర్థ ప్రయత్నాలు చేస్తాయి.
తన శిష్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. క్షుద్ర శక్తుల ఉనికి తెలియజేయాలని అనుకున్నాడు. బిత్రోచిని నిద్ర లేపి తాంత్రిక ప్రపంచానికి తానేమిటో నిరూపించాలనుకున్నాడు మరియప్ప.
చేతబడిలో అతి ప్రమాదకరమైన పదమూడవ అంకం...నిక్శూచి..
గాలిలో, వానలో, చీకటిలో వేగంగా ప్రయాణించి ఎదుటి వ్యక్తిని ఆవహించే ప్రేతం...దాని ప్రవేశమే భయానకం...నిక్శూచిని ప్రయోగించిన పన్నెండు మంది మాంత్రికులు నిక్శూచికి బలయ్యారు...అతి ప్రమాదకరమైన ప్రయోగం...నిక్శూచి నిద్ర లేచే సమయంలో ఎవరూ మెలుకువగా వుండకూడదు...తాంత్రికుడు చాలా ధైర్యంగా వుండాలి..
పదమూడవ అంకం మొదలైంది.
మరియప్ప నిక్శూచిని నిద్ర లేపగలడా?
నిక్శూచి నిద్ర లేస్తే?
(ఒక చారిత్రాత్మక సంఘటన...ప్రపంచానికి తెలియని ఆగష్టు 1...నేపథ్యం ...రేపటి సంచికలో)

No comments:
Post a Comment