ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 19 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
01-06-2013 (chapter-52)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
అర్ధరాత్రి 11-59 నిమిషాలు.....
తాజ్ మహల్ ముందు చంద్రహాస్, ప్రణవి....వెన్నెలే వెలుతురై, కన్నుల పండువగా కనుల ముందు నిలిచినట్టు...తాజ్ మహల్ మెరిసిపోతుంది...అనుభూతి పర్యంతమైన, ఉద్విగ్నభరిత క్షణాలు...మాటరాని మౌన భాషని ఆశ్రయించినట్టు....
ప్రణవి తాజ్ మహల్ అందాలను చూడడం లేదు..తాజ్ మహల్ లో ఆమెకు షాజహాన్ కనిపించడం లేదు...చంద్రహాస్ కనిపిస్తున్నాడు...కొన్ని కోట్లు విలువచేసే వ్యాపార ఒప్పందాన్ని కాలితో తన్నేసాడు....ముఖ్యమైన కార్యక్రమాలను వదులుకున్నాడు...ఒక దేశానికి సంబంధించిన వ్యాపారపరమైన కాంట్రాక్ట్ ని పక్కన పెట్టాడు. చార్టెడ్ ప్లాయిట్ బుక్ చేసాడు...అనుమతులు సంపాదించాడు...
అన్నింటి కన్నా...అన్నింటికన్నా ...అన్నింటికన్నా ...తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు పెళ్లి చేసుకునే వెయ్యి మంది జంటలకు ప్రణవి పేరు మీదుగా మంగళ సూత్రాలు అందించాడు.
"ఈ ప్రపంచంలో డబ్బును సంపాదించేవారు కోట్ల సంఖ్యలో వున్నారు....కానీ ఆ డబ్బును ఖర్చు పెట్టేవారు...ప్రేమను పంచేవారు....ప్రేమను ప్రదర్శించేవారు...ఒక్క తన చంద్రహాస్ మాత్రమే...
అన్నీ చేసి,తన కోసం ఇన్నీ చేసి మామూలుగా, ఇది గొప్ప విషయమే కాదన్నట్టు....తన భుజం మీద తలపెట్టి తాజ్ మహల్ లో తననే చూస్తోన్న తన భర్తను చూస్తుంది...
ప్రపంచంలో ఇంత గొప్ప భర్త తనకు తప్ప ఎవరుంటారు? ప్రణవి భర్త వంక ప్రేమగా చూసింది. ఆమెకు మాటలు రావడం లేదు. ఒక మాట తన నోటి నుంచి బయటకు రాకుండానే ఆచరణలో పెట్టి చూపించే భర్త...ఒక్క క్షణ తను భర్తను కోరిన కోరిక గుర్తొచ్చి మొహం ఎర్రబడింది.
ఈ ప్రపంచంలో ప్రేమతో నిండిన ప్రతీ ఇల్లు తాజ్ మహలే....ప్రేమ మహలే...ప్రేమంటే నిర్వచనం తను, తన భర్త ...తన భర్త అంటే ప్రేమ...ఆ క్షణం ప్రణవికి ప్రపంచాన్ని జయించినంత సంబరంగా వుంది.
కానీ మరుక్షణం ఏం జరుగబోతుందో తెలియదు.
************************
చంద్రహాస్ తాజ్ మహల్ అందాలను చూస్తున్నాడు. అతని మనసేదో కీడుని శంకిస్తోంది. ప్రణవికి ఇంకా తాజ్ మహల్ ని చూడాలని అనిపించలేదు. అదే మాట భర్తతో చెప్పింది ఆశ్చర్యంగా చూసాడు చంద్రహాస్.
"తాజ్ మహల్ ఒక కట్టడం...కదలిక లేని ప్రేమ చిహ్నం...నా ఎదురుగా వున్న ఈ తాజ్ మహల్ ని, నా కళ్ళ ముందు వున్న తాజ్ మహల్ ని వదిలేసి, మరో తాజ్ మహల్ ని చూడడానికి వచ్చాను." భర్త భుజం మీద తల వాల్చి అంది.
చంద్రహాస్ భార్య వంక చూసి..."ఈ క్షణం ఇక్కడే నీతో రొమాన్స్ చేయాలనిపిస్తుంది" సరదాగా అన్నాడు. ఆ ఫీల్ ని అనుభూతిస్తూ అన్నాడు...
"మీ అనుభూతిలో ఐక్యమవ్వడానికి నేను సదా సంసిద్ధం..." అంది.
చంద్రహాస్ ప్రణవిని హత్తుకున్నాడు..వేన వేల స్పర్శల వెచ్చని ఊపిరులు అక్కడ పురుడు పోసుకున్నాయి.
ప్రణవి ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది.
దూరంగా వీళ్ళని తీసుకువచ్చిన ప్లయిట్ వుంది.
**************
ప్రణవి ముందు నడుస్తోంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా...? అని వుంది. ఇంటికి వెళ్ళగానే భర్త పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవాలి, తాజ్ మహల్ దగ్గర పుట్టిన రోజు జరుపుకోవాలన్న ఆలోచన విరమించుకుంది. ప్లయిట్ లో కేకు వుంది.
ప్రణవి ప్లయిట్ ని సమీపించింది. అప్పుడు జరిగిందా ఊహించని దుస్సంఘటన. పెద్ద విస్ఫోటనం....
తాజ్ మహల్ సాక్షిగా....
***************
కార్తికేయ నిట్టూర్చాడు...ముగ్ధ అలానే ఉండిపోయింది. కళ్ళ ముందు విషాదం కనిపిస్తుంది.
"ప్లయిట్ పేలిపోవటంతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి...ఆ పేలుడులో పైలట్ శరీరం ముక్కలైంది. ప్రణవి అనిపించలేదు. బహుశా బూడిదలో కలిసిపోయింది అనుకున్నారు. ఆ క్షణం నుంచి చంద్రహాస్ భార్య బ్రతికే ఉందన్న నమ్మకంతో అన్వేషిస్తున్నాడు. మరో పక్క ఈ బ్లాస్ట్ కు సంబందించిన వివరాలు సేకరిస్తున్నాడు. దర్యాప్తు సంస్థ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ప్రణవిని గుర్తుపట్టాను...అయితే ఈ పేలుడు వెనుక, ప్రణవి అదృశ్యం వెనుక మిస్టరీ తెలుసుకోవాలి. అప్పటి వరకూ ప్రణవి...తన జ్ఞాపకాలు గుర్తుకు లేకుండా ఉంటేనే మంచిది.
ఇందాకే తెలిసిన మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే చంద్రహాస్ కన్పించడం లేదు...
*****************
అదే సమయంలో నిక్శూచి ప్రయోగం మొదలైంది.
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

No comments: