ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 19 June 2013

1) డబ్బు దస్కం, అధికారం ఇవన్ని జీవితానికి సాఫల్యఫలాలు. కొంతమందికి యివే మెచ్చుతారు, కోరుకుంటారు. విలువలు, స్వజనం, బంధుజనం, మిత్ర పరివారం యివన్నీ జీవితానికి మూలాలు. జీవితాంతం ఫలభోజనం అవసరం లేకుండా జీవితం వెళ్ళబుచ్చవచ్చు కానీ ఎవరైనా వారి మూలాలను మరిస్తే వారి జీవితం అధోగతి పాలైనట్టే.

2) జీవిత సంగ్రామమంలో గెలుపు ఓటములు సర్వ సాధారణం. ఓటమి జీవితానికి ముగింపు కాదు, గెలుపు జీవిత సఫలానికి కొలమానం కాదు. నిరంతర జీవన యాత్ర చేసే వారికి రహదారిలో ఎదురయ్యే రెండు మజిలీలే.. గెలుపు ఓటములు.

(P.S....మెలుకువతో మెలిగితే గెలుపు నీదంతే)

No comments: