ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
07-06-2013 (chapter-58)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ఆగష్టు 1...
ఆ రోజుకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది.చంద్రహాస్ పుట్టిన రోజు...అదే రోజు చంద్రహాస్,ప్రణవి ల పెళ్లిరోజు...అందుకే ఆగష్టు 1 తాజ్ మహల్ సాక్షిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు.సెక్యూరిటీ చీఫ్ మెహతా ఆ బాధ్యత స్వీకరించాడు.
మెహతాకు ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా కళ్ళ ముందే కదలాడుతుంది.ఆ విధ్వంసానికి అతనే ప్రత్యక్ష్య సాక్షి...సూత్రధారి..
ఆ కుట్రలో వున్నమరో వ్యక్తి స్టీఫెన్.
**************
ఆగష్టు 1...
మెహతా తనకు ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత స్టీఫెన్ చాంబర్ లోకి వెళ్ళాడు. స్టీఫెన్ మెహతా కోసమే ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ ఎదురెదురు కూర్చున్నారు.
"చెప్పండి మెహతా ....ఈ రోజు ఆగష్టు 1 కదా...మీ బాస్ బిజీగా వుంది ఉంటాడు...ప్రధాన మంత్రి మొదలు ప్రతీ ఒక్కరూ గ్రీటింగ్స్ చెబుతూనే వుంటారు..."నవ్వుతూ అన్నాడు స్టీఫెన్.
"అందులో మీరు కూడా ఉన్నారుగా "నవ్వుతూనే అన్నాడు మెహతా..
"తప్పదుగా...నవ్వుతూనే కత్తులతో పొడుచుకునే యుద్ధం మనది...ఓకే...ఇంతకీ ప్రెజెంట్ పొజిషన్ ఏమిటి ? ఈ బర్త్ డే డెత్ డే గా,పెళ్లిరోజు చావురోజు గా మారుతుందా ? " అడిగాడు స్టీఫెన్.
"పెద్ద మొత్తంలో మీ దగ్గర తీసుకున్నాను...మీ కోరిక తీర్చకుండా ఉంటానా ? బాస్ కళ్ళలో ఆనందం చూడడం నా బాధ్యత " మెహతా అన్నాడు.
"బాస్ అంటే నేనా ? చంద్రహాసా ?"
"ఆ బాస్ జీతం మాత్రమే ఇస్తారు.మీరు విలాసవంతమైన జీవితం ఇచ్చారు...అయినా నన్ను చంద్రహాస్ దగ్గర పని చేయమని చెప్పింది..అందుకు మార్గంవేసిందీ మీరేగా ? అందుకేగా ఎప్పటికప్పుడు అక్కడి వివరాలు మీకు చేరవేస్తున్నాను "
" ప్రతీ ఇన్ఫర్మేషన్ కు పాయింట్స్ అదే కాష్ రూపంలో నీకు ముడుతూనే వున్నాయి.శత్రువు ఎప్పుడు మన పక్కనే వుండాలి...అది సరే చంద్రహాస్ తాజ్ మహల్ చూడడానికి వెళ్తున్న విషయం ఎవరికి తెలుసు ?
"సెక్యూరిటీ చీఫ్ గా నాకు మాత్రమే తెలుసు...అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాను...తాజ్ మహల్ చూసి అక్కడి నుంచి సరాసరి ఆ షాజహాన్ దగ్గరికే వెళ్ళే ఏర్పాటు చేసాను...పైలట్ కు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను. గుడ్ న్యూస్ సారీ చావు న్యూస్ తో మీ దగ్గరికి వస్తాను " చెప్పి కాసేపు అక్కడ వుండి
బయటకు వచ్చాడు.
******************
తాజ్ మహల్ దగ్గర చంద్రహాస్,ప్రణవి సెలబ్రేట్ చేసుకుని బయటకు వచ్చి ప్లయిట్ ఎక్కగానే పేలిపోయే ఏర్పాటు జరిగింది. ఎక్కడో చిన్న పొరపాటు..ముందు ప్రణవి వచ్చింది...అదే టైములో ప్లయిట్ బ్లాస్ట్ అయింది. పైలట్ స్పాట్ డెడ్...ప్రణవి గాయాలతో ఉంది.మెహతా క్రిమినల్ బ్రెయిన్ షార్ప్ గా పని చేసింది.
క్షణాల్లో ప్రణవి ని తప్పించాడు. ఓ అనాథ శవాన్ని ఆ మంటల్లో ఆహుతి చేసాడు...
ప్రణవి స్టీఫెన్ దగ్గర బందీగా ఉంది. చంద్రహాస్ ని మానసికంగా దెబ్బ తీయడానికి ప్రణవి ని ఆయుధంగా వాడుకోవాలన్నది వాళ్ళ ప్లాన్.
*********************
కారు సడెన్ బ్రేక్ తో ఆగింది.ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చాడు మెహతా....కట్టుదిట్టమైన భద్రతా మద్య కూడా తప్పించుకున్న ప్రణవి...
తమ కారును ఎవరో ఫాలో చేస్తున్నారు...ఎవరో కాదు...సంధ్యాజ్యోతి...
ఇదే సరైన సమయం...సంధ్యను కిడ్నాప్ చేయాలి...తనని ఘోరంగా అవమానించిన సంధ్య మీద పగ తీర్చుకోవాలి.
నాంపల్లి కి సైగ చేసాడు ...కారు స్లో చేసాడు....వెనక నుంచి అక్తివా మీద వస్తోన్న సంధ్య ఆగిపోయింది.అప్పటికే ఆలస్యమైంది.
********************
అదే సమయంలో చంద్రహాస్ ఉలిక్కిపడి లేచాడు.గాఢమైన నిద్రలో నుంచి లేచాడు...ఓ మూలాన వున్నా అక్వేరియంలో చేపలు భయంతో పరుగులు తీస్తున్నాయి.ఓ నల్ల పిల్లి భయంతో పరుగులు తీస్తుంది.గోడ గడియారంలోని పేద ముళ్ళు వేగంగా వెనక్కి తిరుగుతుంది. పైన వున్న సీలింగ్ ఫ్యాన్ కిందికి జారుతోంది.
అక్కడ భయం ...భయంగా చూస్తోంది .
*****************
(రేపటి వరకూ ఈ సస్పెన్స్..)

No comments:
Post a Comment