ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

1) జీవనప్రయాణంలో ప్రవచించిన ఉపదేశాలు విని ఆపై నీ నడవడి, వినిన దానిని ఆచరించే తీరే నీ అభిమాతాన్ని తెలిపే మతమవ్వే..

2) ఇతరులపై అధికారం చెలాయించాలనుకునే భావనే నీ మానసిక పరిపుష్టి సమంగా లేదని తెలిపక తెలిపే..అనురాగంతో అభిమానంతో అర్ధరాజ్యం పొందవచ్చు, దబాయించి సూది మొన ప్రదేశం కూడా పొందలేవు..
(PS..పిల్లలు నింపబడే పాత్రలు కారు, వారు వెలిగించబడిన జ్యోతులు/దీపాలు..తెలుసుకోండి)

No comments: