ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
09-06-2013 (Chapter-60)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ప్రణవి క్యాబ్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె ట్రాన్స్ లో వున్నట్టు వుంది. క్యాబ్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సైన్స్ కు అందని, తర్కానికి చేరని ఎన్నో సంఘటనలు చరిత్రలో వున్నాయి, ఒక అద్భుతమైన విషయం ...మన మేథస్సుకు పదును పెట్టవచ్చు.
ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి అతని ద్వారా హత్యలు చేయించిన సంఘటనలు నేరచరిత్రలో వున్నాయి. టెక్నాలజీ అప్పుడప్పుడు పక్కదారి పడుతుంది. క్రిమినల్స్ తమ పరిజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తారు. క్యాబ్ ని నడిపిస్తోన్న డ్రైవర్ నిద్రలో నడుపుతున్నట్టు వుంది. రాత్రి వేళ కావడం, క్యాబ్ జనసంచారం లేని ప్రాంతంలోకి రావడం వల్ల, నిర్మానుష్యమైన ఆ ప్రాంతం భయాన్ని ఎగదోస్తోంది. క్యాబ్ అడవిలాంటి ప్రాంతంలోకి ప్రవేశించింది. క్యాబ్ ని ఫాలో అవుతుంది, కార్తికేయ కారు. ప్రణవి ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి కార్తికేయ సిద్ధంగా వున్నాడు. కారులో షిర్డీ సాయి, వెంకటేశ్వరస్వామి ప్రతిమలు రెండు వైపులా అతడిని సదా కాపాడుతున్నట్టు వున్నాయి.
క్యాబ్, కార్తికేయ కారు స్మశాన ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఆ ప్రతిమలలో నుంచి ఒక కాంతిపుంజం వెలువడిన ఫీలింగ్ కలిగింది, కార్తికేయకు.
***************
మలయప్ప ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని కణతల్లో చిన్న నొప్పి లాంటిది. అతని క్షుద్రప్రయోగానికి ఏ శక్తో అడ్డుపడబోతుందన్న సంకేతం. కళ్ళు తెరవకూడదు. క్షుద్రప్రయోగం మధ్యలో ఆపకూడదు...నిక్శూచి నిద్రలేవడానికి తన క్షుద్రశక్తి ప్రతాపాన్ని చూపడానికి ఆయత్తమవుతుంది.
సరిగ్గా ఆ క్షణంలోనే క్యాబ్, కార్తికేయ కారు శిథిలమైన ఆలయం వైపు వెళ్తున్నాయి. కార్తికేయ మనసు ఒక్క క్షణం భక్తీ భావంతో పులకించింది. ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం, ఒక అమృత స్పర్శ...
****************
చంద్రహాస్ తన శక్తినంతా కూడతీసుకున్నాడు. ఎదురుగా వున్నా భీకర ఆకారం తనను కబళించదానికి వస్తోంది. ఎవరో తనను బంధించినట్టు....శరీరం సహకరించనట్టు...అతనికి చావు భయం లేదు...కానీ చనిపోయే లోగా తను తన ప్రణవిని ...తన ప్రాణాన్ని చూడాలి. తను ప్రాణంతోనే వుంది అన్న తన నమ్మకం నిజమవ్వాలి. తన స్పర్శతో ఇది నిజమే అన్న వాస్తవ స్వప్నం సాకారమవ్వాలి.
ఏ అదృష్ట శక్తో తనను కాపాడుతుందన్న నమ్మకం...తన ప్రణవిని చూడకుండా తను కన్నుమూయడన్నవిశ్వాసం.
ఆ వికృతాకారం చంద్రహాస్ కు వెంట్రుకవాసి దూరంలో వుంది.
నిక్శూచి నిద్రలేవడానికి క్షణాల వ్యవధి మాత్రమే వుంది.
********************
క్యాబ్, కారు రెండు ఆలయం ముందు ఆగాయి. ఒక్కసారిగా గాలి దుమారం...ఆకులు, చెత్త, ముళ్ళపొదలు...ఆ గాలిలో కొట్టుకుపోతున్నాయి. వాయుదేవుడు స్వామివారి ముందు మోకరిల్లాడు, ఆలయాన్ని శుభ్రం చేస్తున్నట్టు...గాలి కదిలింది. ప్రణవి క్యాబ్ దిగింది. ప్రణవిని దించిన క్యాబ్ వచ్చిన దారిలోనే కదిలింది. ప్రణవి మెడలోని సన్నటి బంగారు గొలుసు క్యాబ్ లో పడిపోయింది, ఆ క్యాబ్ డ్రైవర్ చేసిన సాయానికి అందిన ప్రతిఫలంగా..
ప్రణవి ఆలయంలోకి నడిచింది. తూలి పడబోయి గుడి పైభాగానికి వేలాడుతున్న గంటని పట్టుకుంది. గంట మోగింది ...గాలికి మిగితా గంటలు ఒకదానికి మరొకటి తగిలి మహా శబ్దాన్ని సృష్టించాయి. మామూలు శబ్దాలు కావు...సకల చరాచర సృష్టిని మేల్కొలిపే నాదాలు, శబ్దాలు...ఉరుములు, మెరుపులు..ఆ మెరుపుల్లో దూరంగా వున్న స్మశానం కనిపించింది కార్తికేయకు. తన కర్తవ్యం, ఆ దేవదేవుడి ఆంతర్యం అర్థమైంది.
******************
(దైవశక్తికి, దుష్టశక్తికి జరిగే పోరాటం ..రేపటి సంచికలో)

No comments:
Post a Comment