ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

1) మనసులో ఎవరినైనా వరించితే ముందు వారి పట్ల అనురాగాన్ని చూపించి వారి మెప్పు పొందండి, ఆపై నీ వలపుని అంగీకరించిన వనిత సమ్మతితో ఏకం కండి. అందుకే అంటారు ఎవరిపైనైనా ప్రేమ వుంటే చూపించండి, చెప్పకండి మరదే ఎవరిపైనైనా ద్వేషం వుంటే సూటిగా చెప్పండి కానీ ద్వేష భావాన్ని, వివక్షను చూపించకండి. చర్చలతో ఎంతటి క్లిష్ట సమస్యకైనా సమాధానం దొరుకుతుంది. కాదంటారా....

2) చిన్న చిన్న సహాయాలకు కూడా ధన్యవాదాలు తెలిపి చూడండి, మనసుకు ఆహ్లాదం ఎంత కలుగుతుందో. ముఖ్యుడిగా వుండడం కంటే మానవత్వం వున్న మనిషిగా బ్రతకడం, మనగలగడం ముఖ్యం. సంతోషంతో కూడిన హృదయం ఓర్పును ఆనందదాయకం చేస్తుంది. ఏమంటారు....


(P.S. ... మిత్రులకు అవసరమైన వారికి అందివ్వడానికి మంచి సలహాను మించిన కానుక మరోటి లేదు).

No comments: