దీక్షిత రామాయణం
(6వ భాగం )
(ప్రముఖ రచయిత విసురజ సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో...)
***********
రామచంద్రుని సుగుణాలను వర్ణించిన నారదుడు స్థూలంగా రామ కథ కూడా చెప్పాడు. వాల్మీకి మనసు పొరల్లో ఎక్కడో దాగిన జ్ఞాపకాల దొంతరను ఈ కథా శ్రవణం మళ్ళీ కదిలించింది. ఆ మహర్షి శ్రీరాముని సమున్నత వ్యక్తిత్వ వైభవానికి పరవశుడయ్యాడు. తన్ను తాను మరచిపోయాడు. అతడి మనసంతా ఆ రాముని ఆరామమై పోయింది. మనోఫలకం నిండుగా సర్వశుభ లక్షణ సంశోభితుడైన ఆ శ్రీరాముని దివ్యమంగళ విగ్రహాన్ని నింపుకొన్నాడు వాల్మీకి. రాముని గురించిన ఆలోచనలతోనే రోజంతా గడుపుతున్నాడు.ఇదిలా సాగుతుండగా ఒకనాడు జరిగిన మరో సంఘటన వాల్మీకి జీవితాన్ని మరో మలుపు తిప్పింది.
వాల్మీకి ఆశ్రమం తమసా నదీ తీరాన ఉంది. దట్టమైన అరణ్య గర్భంలో పశుపక్ష్యాదులకు నానావిధ మృగాలకు ఆవాసమై అత్యద్భుత ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది ఆ మునివాటిక.
ఒకనాటి అపరాహ్న వేళ స్నాన సంధ్యాది కార్యక్రమాల కోసం వాల్మీకి శిష్య సమేతంగా తమసా తీరానికి బయలుదేరాడు. మార్గ మద్యాన ఒక చెట్టుపై కనిపించిన సహజ సుందర దృశ్యం ఆ మహర్షిని అమితంగా ఆకట్టుకుంది. ఆ చెట్టు శాఖపై పరస్పరాపేక్షతో, ఆనందంగా క్రీడిస్తున్న క్రౌంచ పక్షుల జంట వాల్మీకిని ఆకర్షించింది.
ఈ దృశ్యం చూడగానే ఎందుకో అతడి మనసు ఆహ్లాదభరితం అయింది. ఇదీ అని చెప్పలేని అనిర్వచనీయ అనుభూతితో మహర్షి ఆ పక్షుల ప్రేమానుబంధాలను కాంచి పరవశించిన వేళ.. ఊహించని ఒక విషాదం జరిగిపోయింది.
ఎక్కడినుంచో ఆకస్మికంగా దూసుకొచ్చిన ఒక బాణం ఆ పక్షుల జంటలోని మగపిట్టను తాకింది. మరుక్షణం అది విలవిల లాడుతూ కొమ్మ మీదనుంచి నేలరాలింది.
నేలపై పడిన ఆ పిట్ట బాణం దెబ్బకు గిలగిలా కొట్టుకొని మరణించింది. అది చూసి దాని జంట పక్షికి గుండె పగిలింది. ప్రియుని ఎడబాటు తాళలేక వియోగ పరితాపంతో వగచి విలపించింది.. ఆ పై వేదనా భారంతో తను కూడా కన్నుమూసింది.
ఈ విషాద దృశ్యంతో వాల్మీకి మనసు వికలమైంది. కరుణార్ద్రతలకు నెలవైన ఆ ముని హృదయం ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా క్రోధంతో భగ్గుమంది.
బాధ, ఆవేదన, కోపం ముప్పిరిగొని వివశుడైన వాల్మీకి ..
"పాపాత్ముడా! ఎంత పని చేశావురా. ఆనందంగా కలిసి జీవిస్తున్న క్రౌంచ పక్షుల్ని నిష్కారణంగా చంపావు. నేవు బతుకంతా నిలువ నీడ లేకుండా తిరుగుతావులే.." అంటూ శపించాడు.
విచిత్రంగా వాల్మీకి మనసులోని విషాదం, క్రోధం వాక్య రూపంలో కాకుండా.. ఒక శ్లోక రూపంలో వ్యక్తం అయ్యాయి.
వాల్మీకి ఈ చిత్రానికి ఆశ్చర్య పోయాడు. అసంకల్పితంగా ఇలా ఎలా జరిగిందో అర్థం కాక విస్మయానికి గురయ్యాడు
************
(రమణీయం,కమనీయం,పరమ పావన రామాయణం..ఇంకా వుంది .రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి )

No comments:
Post a Comment