ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 26 June 2013

కవిత: తండ్రి లోటు
..............
లోకంలో నాన్నల దినోత్సవంట 'నాన్న' నేడు
విషెస్ చెబుదామంటే నాకు 'నాన్న' లేడు

ఈ ఆన్సర్ లేని ప్రశ్నకు ఎట్టా జవాబిచ్చేది
అయ్యో క్యాన్సర్ రక్కసి గొంతు నొక్కి కబళించింది

సత్తువుడిగిన అమ్మ శోకం ఎట్టా తీర్చేది 'నాన్న'
ఉమ్మడి సోత్తైన అనురాగాన్ని ఏట్టా పంచేది 'నాన్న'

మితభాషే నీ కులం నిజాయితే నీ మతం కదా 'నాన్న'
సుచరిత్రే నీ దైవం కఠోర శ్రమే నీ అభిమతం కదా 'నాన్న'

నీ భుజాలపై నాడు ఆడుకున్నాం 'నాన్న'
మా భుజాలపై నీ పాడె మోసాం 'నాన్న'

నీవు మా చదువుకి నాడు ఫీజులు కట్టేవు 'నాన్న'
మేము నీ అంతిమయాత్రకు రసీదు అందేము 'నాన్న

నువ్వెళ్ళి ఏడాదైపోయే 'నాన్న' మా బ్రతుకు ఎడారైపోయే
కష్టమొచ్చిన బాధోచ్చిన 'నాన్న' వేదన చెప్పుకునే దిక్కులేకపోయే

నువ్వెళ్ళినాక మాకు ఎన్నెన్ని ఇక్కట్లు వచ్చాయో 'నాన్న'
నవ్వుమోముతో ప్రసాదన్నయ్య అకస్మాత్తుగా కాలంచేసే 'నాన్న'

నీ సంరక్షణలో ఎంత హాయీ పొందామో 'నాన్న'
నీవు లేని ఈనాడే పూర్తిగా మాకు అవగతమయ్యే 'నాన్న'

నింగిలోని స్టార్ అయ్యాడని పిల్లలంటారు నిన్ను 'నాన్న'
దేముడి దగ్గరకు వెళ్ళేడని మరికొందరంటారు నిన్ను 'నాన్న'

నిండు పున్నమి వచ్చే పండు వెన్నెల తెచ్చే నెలకోమారు 'నాన్న'
పున్నములెన్ని పూచినా వెన్నెలలెన్ని విరిసినా మా బ్రతుకుచీకటిని మాపునా 'నాన్న'

ఎన్ని నాన్న దినోత్సవాలోచ్చినా మరి నేను జరుపుకోను 'నాన్న'
సంవత్సారానికి ఒకసారి నాన్న పండుగ వస్తే మిగతా కాలంలో నిన్ను ఎక్కడ విడిచేది నిన్నుఎట్టా మరిచేది 'నాన్న'
.........
విసురజ
( ఇది కవిత రూపకమైన నా హృదయ ఘోష....ఫాదర్స్ డే జరుపుకోవటానికి నేను విరోధం కాదని తెలియగలరు)

No comments: