దీక్షిత రామాయణం
( రెండవ భాగం)
.........................................................................................................................
ఒక మహర్షి ఆ చోరుడ్ని ఇలా ప్రశ్నించాడు.
"ఓయీ! ఎందుకు నీవిలా పరులను హింసిస్తున్నావు? ఇది పాపమని నీకు తెలియదా?"
"స్వామీ ఇది నా వృత్తి.. కుటుంబ పోషణ కోసం ఎవరు ఏ వృత్తినైనా చేయవచ్చు పాపం, పుణ్యం అన్నీ మీబోటి వాళ్ళకే తప్ప మాకు కాదు, అన్నాడు కరుకుగా." భార్యా బిడ్డల పోషణ బాధ్యత తనపై ఉంది గనుక అందుకై ఏ పని చేసినా తప్పు కాదనే రీతిలో వాదిస్తున్న ఆ చోరునితో మరో ముని ఇలా పలికాడు. "పాపం చేసిన ఎవడైనా సరే దాని ఫలితం అనుభవించాల్సిందే.."
ఈ మాటతో దొంగకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఒహోయ్ సన్యాసులూ నన్నే బెదిరిస్తున్నారే... ఇదిగో ఈ కత్తి చూశారా? మీ అందరి కుత్తుకలూ కోసినా పదును తగ్గదు...." అంటూ పొడవాటి కత్తిని ఝళిపించాడు.
"బాబూ! నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు సరే.. కానీ నిన్ను మింగడానికి సిద్ధంగా ఉన్న ఆ రాక్షసిని ఎలా భయపెట్టి తరిమేస్తావ్ మరి? " అంటూ చేతితో ఒకవైపు చూపుతూ ప్రశ్నించారా మునిపుంగవులు.
హహ్హహ్హా ..అంటూ వికటాట్టహాసం చేస్తూ.. "రక్కసా... నన్నా..మింగుతుందా?" అంటూ మునులు చూపిన వైపు తల తిప్పాడా దొంగ. మరుక్షణంలో ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. అక్కడ అతడికి నిజంగానే ఒక మహారాక్షసి కనిపించింది. పర్వత పరిమాణంలో ఉన్న ఆ రాక్షసి నోరు పెద్ద దిగుడు బావిలా కనిపిస్తోంది. పెద్ద కోరలు, నల్లటి ఒళ్ళు, నోటి వెంట రక్తపు ధారలు, ఒళ్లంతా మానవ పుర్రెలతో అలంకరించుకుని మహా భయంకరంగా ఉందా ఆకృతి. భయంతో ఆ చోరునికి నోటి వెంట మాట పెగలడంలేదు... అతి కష్టంమీద మునులను ప్రశ్నించాడిలా..
"సాములూ, ఇది మీ మాయ కాదు గదా?" అని.
మందహాసం చేసారు మహర్షులు. "ఇది మాయా కాదు, మహత్తూ కాదు... నీ పాపాల రాశి ఇది. ఇంతకాలం నువ్వు మహా పాపాలు గావించి మూట కట్టుకున్న సంచిత ప్రారబ్ధం. ఇది నిన్ను కబళించక మానదు." అన్నారు.
అంతకంతకూ ఆకృతి పెరుగుతూ తనను మింగడానికి మీదకు వస్తున్న ఆ రాక్షసిని చూసి పై ప్రాణాలు పైనే పోయిన దొంగకి అంతకాలం తనపై, తన బలసామర్థ్యాలపై ఉన్న విశ్వాసం ఒక్కసారిగా వీగిపోయింది. తను చేసేది పాపమనే యోచన కూడా లేకుండా ఇంతకాలం గడిపిన ఆ చోరునికి దాని విశ్వరూపం ఒక్కసారిగా విస్పష్టంగా కనిపించింది. అతడిలో భయం స్పష్టంగా కనిపిస్తోంది..
ఒక మహర్షి అతడిలో మిగిలిన అంతిమ సంశయాన్ని కూడా తొలగించాలని భావించాడు.
"నువ్వు ఈ రాక్షసి బారినుంచి బయట పడాలంటే ఒక్కటే మార్గం ఉంది".. అన్నాడాయన.
అదేమిటో చెప్పి తనను కాపాడమని ప్రాధేయపూర్వకంగా అడిగాడు చోరుడు.
"నువ్వు నీ వాళ్ళ కోసం ఎన్నో పాపాలు చేశానని అంటున్నావు.. అయితే ఆ పాపంలో వాళ్ళు కూడా కొంత భాగం తీసుకుంటారేమో అడిగి చూడు... అలా ఎవరైనా భాగం తీసుకునేందుకు ముందుకువస్తే... నీకు ఈ రాక్షస పీడ విరగడవుతుంది."
ఓస్ అంతేనా... అంటూ ఒక్క ఉదుటున ఇంటికి పరుగు తీశాడు ఆ దొంగ.
తాను సర్వం కుటుంబం కోసమే చేస్తున్నపుడు వారు తనను నిరాదరించరని పూర్తిగా నమ్మాడతడు.
తన ఘోర పాతకాల తాలూకు పాప ఫలాన్ని, అందువల్ల లభించే నరకాన్ని తనతో పాటు పంచుకునే వారెవరని అందరినీ అడిగాడు.
భార్యాబిడ్డలు ఒకే మాట చెప్పారు. "మమ్మల్ని పోషించడం నీ విధి. అందుకు నీవు అనుసరించే మార్గం నీ ఇష్టం. అందలి పాప పుణ్యాలు కూడా నీవే. అంతే తప్ప వాటి పాప భారాన్ని మేము మోయలేము. మోయం కూడా."
మానవ పరమైన సంబంధ బాంధవ్యాలు అశాశ్వతాలని. వాటి ముసుగులో చేసే కర్మలకు ఎవరికి వారే ఏకాకిగా బాధ్యత వహించాలని తెలియజెప్పడమే ఋషుల చర్యలోని ఆంతర్యం. ఆ సత్యం బోధపడింది అతడికి. స్వర్గ నరకాలు స్పృహకు వచ్చాయి. ఎవరి కోసం హైరానా పడుతున్నాడో, ఎన్ని పాపాలైనా చేస్తున్నాడో.. వాళ్ళే తనను ఇలా ఒంటరిని చేయడంతో.. ఆ మరుక్షణంలో అతడికి మోహం నశించింది.
అతడిలో మోహపాశం తొలగగానే అతడిని తరుముతున్న భూతం కూడా అంతర్ధానం అయిపోయింది.
అతడిలో నిక్షిప్తమై ఉన్న పురాకృత పుణ్య సంస్కారాలు ఆ క్షణంలో ఉద్దీపనం అయ్యాయి..
పశ్చాత్తాపంతో కరిగి నీరైన అతడు వడివడిగా మునుల చెంతకు వెళ్ళాడు.
వారి పాదాలపై పడ్డాడు.. తన తప్పులు మన్నించాలని, తనను ఉద్ధరించాలని వేడుకున్నాడు.. కన్నీళ్ళతో వారి పాదాలు కడిగాడు.
కరుణాంతరంగులైన ఆ మహర్షులు కరిగిపోయారు.
దోచుకోబోయిన దొంగకు ఎదురేగి మరీ తమ వద్దనున్న ఆధ్యాత్మిక సంపదను, ఎనలేని తపోశక్తిని వారు ధారపోసారు. తద్వారా సర్వమానవ జాతికి మహోపకారం గావించారు ఆ సప్తర్షులు.
***********************
(రమణీయం,కమనీయం, పరమ పావన రామాయణం..ఇంకా వుంది. రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి)

No comments:
Post a Comment