ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

కవిత: ప్రేమ గేయం
................. ........ 


Photo: కవిత: ప్రేమ గేయం 
................. ........ 
చీకటి చీర కట్టింది
ఝామురాత్రి జావళి పాడింది
చల్ల గాలి వీచింది
జాజి మల్లి విచ్చింది
మెల్లగా ఎదను గిల్లగా నవ్వవే నా చెలి

మెరిసే చందమామ అంబరాన నిలిచింది
వెండి మబ్బు వయ్యారం చూపింది
వెన్నెల వన్నెల పైటేసి మురిసింది
వెలుగు చుక్కల సారే తెచ్చిచ్చింది
చల్లగా మత్తు జల్లగా నవ్వవే నా చెలి

తలపులలోనే ముద్దుగుమ్మ నిలిచింది 
కంటికేమో నిద్రమ్మ రానుపోమ్మంది  
మనసుకేమో వలపమ్మ తెగకోరింది 
వంటికేమో వయసమ్మ అల్లరినేర్పింది
హాయీగా మది ఊయలలూగ నవ్వవే నా చెలి 
 
తొలి పొద్దు తూర్పున పొడిచింది
వెలుగు రేఖ తిమిరంపై గెలిచింది
తీరని తీయని తలపు నెరవేరింది 
మనసు తెర తీసి చెలి వలపందించింది
కమ్మని ప్రేమ కమనీయమవ్వ నవ్వేలే నా చెలి
......
విసురజ 
 చీకటి చీర కట్టింది
ఝామురాత్రి జావళి పాడింది
చల్ల గాలి వీచింది
జాజి మల్లి విచ్చింది
మెల్లగా ఎదను గిల్లగా నవ్వవే నా చెలి

మెరిసే చందమామ అంబరాన నిలిచింది
వెండి మబ్బు వయ్యారం చూపింది
వెన్నెల వన్నెల పైటేసి మురిసింది
వెలుగు చుక్కల సారే తెచ్చిచ్చింది
చల్లగా మత్తు జల్లగా నవ్వవే నా చెలి

తలపులలోనే ముద్దుగుమ్మ నిలిచింది
కంటికేమో నిద్రమ్మ రానుపోమ్మంది
మనసుకేమో వలపమ్మ తెగకోరింది
వంటికేమో వయసమ్మ అల్లరినేర్పింది
హాయీగా మది ఊయలలూగ నవ్వవే నా చెలి

తొలి పొద్దు తూర్పున పొడిచింది
వెలుగు రేఖ తిమిరంపై గెలిచింది
తీరని తీయని తలపు నెరవేరింది
మనసు తెర తీసి చెలి వలపందించింది
కమ్మని ప్రేమ కమనీయమవ్వ నవ్వేలే నా చెలి
......
విసురజ

No comments: