ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
20-05-2013 (40th chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
ఒక్క క్షణం సంధ్యాజ్యోతి మనసులో వేన వేల భావాలు ఉక్కిరి బికిరి చేస్తున్నాయి.ఇది నిజమేనా ?చినప్పుడు చందమామ కథలు చదువుతూ.కథల ప్రపంచంలో విహరిస్తూ,పెద్దయ్యాక కాల్పనిక సాహిత్యాన్ని చదువుతూ,రచయితల కల్పనా చాతుర్యాన్ని,పాత్రలు తీర్చిదిద్దే విధానాన్ని చూసి ఒక్క సారైనా రచయితలు కలుసుకోవాలని అనుకునేది.
ముగ్ధమోహనం సీరియల్ వస్తున్నప్పుడు ముగ్ధ పాత్ర ,మోహన పాత్రలు చదువుతూ ఇంత గొప్పగా తీర్చిదిద్దిన రచయితను కలుసుకోవాలనుకుంది.ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంది.కానీ ఇప్పుడు తనే ఇంటర్ వ్యూ చేయబోతుంది.
********************
"విసురజ గారు...ఒక పని మీద హైదాబాద్ వచ్చారు...మనం ప్రారంభించిన ఆగష్టు 1 సీరియల్ గురించి , విసురజ ఇంటర్ వ్యూ కావాలని వీక్షకుల నుంచి మెయిల్స్ వస్తునాయి.విసురజ గారిని ఇంటర్ వ్యూ చేసే అవకాశం వచ్చింది. "ఎడిటర్ చెప్పాడు.
సంధ్యాజ్యోతి తల తిప్పి విసురజ వైపు చూసింది.చెరగని చిరునవ్వు...తను ఇంటర్ వ్యూ చేయగలదా? అదీ ఎడిటర్ మందు...ఆమె మనసులోని అభిప్రాయం అర్ధమైనట్టు...ఎడిటర్ లేచాడు.
"ఒక అఫెనవర్ లో వస్తాను.ఈ లోగా ఇంటర్ వ్యూ పూర్తి చేయండి."సంధ్యాజ్యోతి కి చెప్పాడు.తర్వాత విసురజ వైపు తిరిగి "లంచ్ అయ్యాక మీ అభిమానులతో గెట్ టు గెదర్ "వుంటుంది.చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.
***********************
ఎడిటర్ క్యాబిన్ లో ఇద్దరే వున్నారు.చిన్న ప్రకంపనం సంధ్యాజ్యోతి లో...
చిరునవ్వుతో ఆమె వైపు చూసాడు విసురజ "ఫ్రీ గా వుండండి...రచయితను కాక ముందు నేను మీలా కామన్ రీడర్ ని..ఇప్పటికే...అన్నట్టు మీరు బాగా అల్లరి చేస్తారట..."అన్నాడు.
గతుక్కుమంది సంధ్యాజ్యోతి.బి బి సి చెప్పిందా"
మీ గురించి ఎడిటర్ గారు చెప్పారు.కాస్త అల్లరి ఎక్కువ చేసినా,తెలివైన అమ్మాయి అని...ఎంత తెలివైన అమ్మాయి అంటే నా ముగ్ధమోహనం లోని మోహన అంత తెలివైన అమ్మాయి అని..
"మోహన విలన్ కదా ,,,నేను విలన్ ని కాదు కదా "వెంటనే అంది సంధ్యాజ్యోతి.
"మోహన విలన్ లా అనిపించిందా?విసురజ అడిగాడు.
"లేదు...అసలు మోహన ను కూడా కార్తికేయ తో కలిపితే బావుండేది అనిపించింది.క్లయిమాక్స్ లో కార్తికేయ ఇద్దరితో కలిసి వుంటే ...?
"తెలుగు సినిమా క్లయిమాక్స్ లా వుండేది "నవ్వి అన్నాడు విసురజ.
ఒక క్షణం తన ఆలోచన తనకే సిల్లీగా అనిపించింది.మోహన లాంటి అద్భుతమైన పాత్ర రాజస్థాన్ ఎడారిలో దేశ రక్షణ కోసం శిక్షణ పొందడమే బావుంది.ఇప్పటికీ మోహన అక్కడ వుంది అన్న ఫీలింగ్...
"మీ కథల్లో వర్ణన తక్కువగా వుంటుంది.హీరొయిన్ ని వర్ణించే ప్పుడు ... మాచింగ్ బ్లవుజ్,చెవులకు జూకాలు,లిప్ స్టిక్,మాచింగ్ చెప్పులు .."ఒక్క క్షణ ఆగింది.తన అజ్ఞానం తనకే కనిపిస్తుందా ?అనిపించింది.
"ఒక పాత్ర వ్యక్తిత్వమే వీక్షకుడి కళ్ళ ముందు కదలాడాలి...కురిసే మంచు గురించి,వెన్నెల్లో వర్షించే హిమం గురించి,సాయంకాలం కురిసే చిరువర్షం గురించి,గులాబీల గురించి వర్ణన అవసరమా?"
అలానే చూస్తోంది పోయింది.క్షణాల్లో సమాధానం చెప్పగలిగిన అతని మేథస్సు చూస్తూ...
"ఆగష్టు 1 లో ప్రణవి కనిపించకుండానే కథ జరుగుతుంది.."సంధ్యాజ్యోతి అడిగింది.
"మంచి ప్రశ్న ...మీరు మాయాబజార్ సినిమా చూసారా?అడిగాడు విసురజ.
"చూసాను...చాలా సార్లు "
"అందులో పాండవులు కనిపిస్తారా?అడిగాడు విసురజ.
ఒక్క క్షణం గుర్తుచేసుకుంది.ఎక్కడా పాండవులు కనిపించరు.
"కథ లో వీక్షకుడు/రీడర్ లీనమైతే వేటి గురించీ ఆలోచన రాదు.కథ ప్రణవి చుట్టూ తిరుగుతుంది .అదే రచయిత ఇంద్రజాలం "నవ్వి అన్నాడు.
"మీకు మోహన.ముగ్ధ,ప్రణవి లాంటి అమ్మాయిలు తారసపడ్డారా ?
"పడ్డారు "
"ఎక్కడ.."ఆసక్తిగా అడిగింది.
"ఇక్కడే..పేరు సంధ్యాజ్యోతి "
ఒక్క క్షణం గులాబీ వనం తన మొహం లో కనిపించింది.
"వ్యక్తిత్వం వున ప్రతీ అమ్మాయిలో వీళ్ళు కనిపిస్తారు."
"మీరు మీరెవరినైనా ప్రేమించారా ? కాసింత బిడియం గా అడిగింది.
"నన్ను ప్రేమించే ప్రతీ వారిని ప్రేమిస్తాను ,ఈ ప్రకృతిని ప్రేమిస్తాను నా పాత్రలను ప్రేమిస్తాను.."
అలా అకడ ఇంటర్ వ్యూ జరుగుతుంది.తనకు తెలియకుండానే ఎన్నో ప్రశ్నలు అడిగింది.ఆమె లోని బిడియాన్ని,కంగారుని దూరం చేయడానికి విసురజ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది.
ఇపుడు ఎవరినైనా ఇంటర్ వ్యూ చేయగలనన్న నమ్మకం ఆమెకు కలిగింది.
********************
ఆ క్షణమే సంధ్యాజ్యోతి కడుపులో చిన్న నొప్పి...ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకుంది.అనలోని బాధను అనిపించకుండా కవర్ చేస్తోంది.ఆమె మొహం లోని ఫీలింగ్స్ గమనిస్తూ,ఆదుర్దాగా అడిగాడు "సంధ్య గారూ..ఆర్యూ ఆల్ రైట్ ?
చిన్నగా నవ్వింది బాధను పళ్ళ బిగువున భరిస్తూ...
అదే సమయం లో ...
****************
రామతీర్థం క్షుద్ర మాంత్రికుడి ఎదురుగా వున్నాడు.చింత నిప్పుల్లా వున కళ్ళు ...ప్రేతాత్మలను
అచ్చాధనగా ధరించినట్టు అతని శరీరం గగుర్పొడిచేలా వుంది.
"నా చేతబడి శక్తి చూస్తావా ?తన ఎదురుగా వున్నా పిండి బొమ్మని తీసుకుని చిన్న గుండు పిన్నుతో ఆ బొమ్మలో గుచ్చాడు.
***************
విసురజ సంధ్యాజ్యోతి వంక చూసాడు.తన బ్రీఫ్ కేసు లో నుంచి షిర్డీ సాయి ప్రతిమ తీసి సంధ్య టేబుల్ మీద పెట్టాడు.బాధ ..నాభిని చీల్చుకుంటూ...
"ఇది నేను మీకు ఇచ్చే చిరుకానుక..ఆ షిర్డీ సాయి మీ వెన్నంటి ఉంటాడు "ఆమె చేతిలో పెట్టాడు.
వేన వేల విద్యుత్ తరంగాలు ప్రవహించిన ఫీలింగ్...
విసురజ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది.
చిత్రంగా ప్రాణాలు తీసే బాధ మాయమైనట్టు...
*********
(రేపటి సంచికలో...అనూహ్యమైన మలుపు )

No comments: