తడబడే అడుగులు మాట గడబిడయ్యే
పెదవులు పలకవాయే చెలి చెంతనున్న
యాదృచ్చికమో లేక విధి విధానమో తెలియరాలేదు
కోరిన చెలి కన్నులే కలిసి కలబడిన వేళ
జగాన గుణమే ప్రధానమని తెలిసాలే
గడ్డు కాలంలో అక్షరమే అక్కరకొచ్చులే
లాభాలలో నష్టాలలో నువ్వు తోడుంటే
కదిలివెళ్ళిన కాలం వెనువెంటనే తిరిగిరాదా
కలుపుమొక్కల ఏరివేత మొదలెట్టా
కలగలపుమాటల మట్టును పాతరేట్టా
లోలోనే దిగమింగా వలపువేదనా ద్రవాన్ని
మనసు తెలిపేలోపే మంగళసూత్రం దర్శనమిచ్చే
విసురజ
No comments:
Post a Comment