ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 19 June 2013

 Photo: మదిగదిలో విరిసి కొలువైన వయ్యారి పూబంతే 
ఎదనదిలో నిండార స్నానమాడే చిలిపి చామంతి 
ముందు చూడని అందమేదో మనసు కొత్తగా చూసేనే
మౌనం వీడి హృదయమేదో అనురాగగీతమే ఆలపించినే
.............. 
చెలి కులుకులే ఎడదకు ములుకులు కాగా
చెలి వగలే వలపుకు పలుకులు కాగా
వడి వడిగా పరుగిడి పసి మనసే నీ వెంటపడేనే 

చెలి నడకే నెమలికి కంటగింపు కాగా
చెలి నడుమే లతికకు అసూయ కలిగించగా
పద పదమున హోయలు చూసి వెర్రి మనసే నడయాడనే 

చెలి పలుకే హృదిపాటలకు పల్లవి కాగా
చెలి తలపే వలపుబాటలకు రాదారి కాగా
గబ గబమని ప్రేమాటలు వయసుకు ఉరకలునేర్పెనే
................
మదిగదిలో విరిసి కొలువైన వయ్యారి పూబంతే 
ఎదనదిలో నిండార స్నానమాడే చిలిపి చామంతి
ముందు చూడని అందమేదో మనసు కొత్తగా చూసేనే
మౌనం వీడి హృదయమేదో అనురాగగీతమే ఆలపించినే
..............
విసురజ

మదిగదిలో విరిసి కొలువైన వయ్యారి పూబంతే
ఎదనదిలో నిండార స్నానమాడే చిలిపి చామంతి
ముందు చూడని అందమేదో మనసు కొత్తగా చూసేనే
మౌనం వీడి హృదయమేదో అనురాగగీతమే ఆలపించినే
..............
చెలి కులుకులే ఎడదకు ములుకులు కాగా
చెలి వగలే వలపుకు పలుకులు కాగా
వడి వడిగా పరుగిడి పసి మనసే నీ వెంటపడేనే

చెలి నడకే నెమలికి కంటగింపు కాగా
చెలి నడుమే లతికకు అసూయ కలిగించగా
పద పదమున హోయలు చూసి వెర్రి మనసే నడయాడనే

చెలి పలుకే హృదిపాటలకు పల్లవి కాగా
చెలి తలపే వలపుబాటలకు రాదారి కాగా
గబ గబమని ప్రేమాటలు వయసుకు ఉరకలునేర్పెనే
................
మదిగదిలో విరిసి కొలువైన వయ్యారి పూబంతే
ఎదనదిలో నిండార స్నానమాడే చిలిపి చామంతి
ముందు చూడని అందమేదో మనసు కొత్తగా చూసేనే
మౌనం వీడి హృదయమేదో అనురాగగీతమే ఆలపించినే
..............
విసురజ

No comments: