కవిత: వలపు మెరుపు
..........
మేలిముసుగు పరదాలో
నా మేటి చిరునవ్వుల చిన్నది
తెలవారివెలుగు రవ్వల్లో
నా బ్యూటి దరహాసకాంతులు అద్దింది
నింగిని కప్పే చీకటి దుప్పటే
నా కోణంగి కంటికి పెట్టిన కాటుక
మేఘబాల కురిపించే వర్షపు చినుకులే
నా సుమబాల చూపించే అనురాగ హర్షములు
ఉదయ వేళ పక్షుల కిలకిలరవాలే
నా ఎదకలికి పలికే మధురబాష్యాలు
వెచ్చని పొద్దు స్పర్శల కితకితలే
నా మదిమోహిని సిగ్గుల మెరుపులు
తేట తెలుగు బాష అలంకారాలే
నా మనసుబొమ్మ చూపే నయగారాలు
జుంట తేనే తీపి మధురిమలే
నా వలపుకొమ్మ అధరాల మధువులు
ఋతువుల్లోని రాగ సరాగాలే
నా మనసమ్మ తీసే కూనిరాగాలు
ప్రకృతిలోని పచపచ్చని హరితాలే
నా వలపమ్మ మోము వన్నెలవర్ణాలు
....
..........
మేలిముసుగు పరదాలో
నా మేటి చిరునవ్వుల చిన్నది
తెలవారివెలుగు రవ్వల్లో
నా బ్యూటి దరహాసకాంతులు అద్దింది
నింగిని కప్పే చీకటి దుప్పటే
నా కోణంగి కంటికి పెట్టిన కాటుక
మేఘబాల కురిపించే వర్షపు చినుకులే
నా సుమబాల చూపించే అనురాగ హర్షములు
ఉదయ వేళ పక్షుల కిలకిలరవాలే
నా ఎదకలికి పలికే మధురబాష్యాలు
వెచ్చని పొద్దు స్పర్శల కితకితలే
నా మదిమోహిని సిగ్గుల మెరుపులు
తేట తెలుగు బాష అలంకారాలే
నా మనసుబొమ్మ చూపే నయగారాలు
జుంట తేనే తీపి మధురిమలే
నా వలపుకొమ్మ అధరాల మధువులు
ఋతువుల్లోని రాగ సరాగాలే
నా మనసమ్మ తీసే కూనిరాగాలు
ప్రకృతిలోని పచపచ్చని హరితాలే
నా వలపమ్మ మోము వన్నెలవర్ణాలు
....
No comments:
Post a Comment