ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

కవిత: వలపుకి శెలవైంది
..............................

Photo: కవిత: వలపుకి శెలవైంది 
..............................
విరహమేల బాల ఈ వేళ
వలపువెన్నెల చిలికే నేటివేళ 

మనసు శెలవైతే మదాపే
వద్దన్నా మనసు మరి వినకుంటే వలపే

నీ గుండె గూటిలో నా మనసుచిలక చేరిందే చెలి
నా తలపు గూడులో నీ ఆలోచనల పక్కేస్తి చెలి

మది సంద్రానికి ఎదురీది నీ ఎదురుగా నిల్చా చెలి
ఎద తీరంలోకి ఒడుపుగా నీ వలపునావ చేర్చవా చెలి

పారేత్తే మదిలో నీ తలపే తరిమి తరిమి తడిమేలే చెలి
కరిగే కలలో ఒరిగే మనసైన వలపు మణిరాజం నీవే చెలి

నను మరువ విరాగమేల నిను చేర సరాగమేల చెప్పవే చెలి
ఇది విరహమో లేక మరి మరి మోహమో తెలియనైతి చెలి
...............
విసురజ 

No comments: