
గాలిలో దూళిలో నీ రూపం
గోతిలో నూతిలో నీ రూపం
రాతిలో నాతిలో నీ రూపం
నడకలో నడతలో నీ రూపం
భవ్యంగా దివ్యంగా నీ రూపం
నేటిలో రేపటిలో నీ రూపం
రేణులో రేవటిలో నీ రూపం
అణువులో పరమాణువులో నీ రూపం
కలలో కల్పనలో నీ రూపం
కధలో కైతలలో నీ రూపం
కన్నులలో వెన్నెలలో నీ రూపం
పదాలలో పాటలలో నీ రూపం
సర్వం నీవే సర్వేశ్వరుడివి నీవే సాయి
పదకొండు ముత్యాల పలుకులు నీవే సాయి
సకల జగాలకు ఆదివి అద్భుతానివి నీవే సాయి
సకల శుభాలకు నాడివి నాందివి నీవే సాయి
కరుణచూపి పాలించవా మము లాలించవా సాయిదేవా
మమతచూపి దయచూపవా దారిచూపవా సాయిదేవా
వెతలన్నీ నీపై పడవేసి మేము నిశ్చింతగా వుంటిమి సాయిదేవా
కష్టాలన్నీ నీవే వడబోసి మమ్ము నిశ్చయముగా కాపాడరా సాయిదేవా
No comments:
Post a Comment