ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 29 July 2013

1) ఈ జీవన స్రవంతిలో తప్పులు చేయాని వారుండరు.. కాకపోతే తమ తప్పుల్ని గుర్తించి, తమలో పరివర్తన కలిగించిన వారి పట్ల రుణపడి, జీవితానికి సుమార్గం ఏర్పరుచుకోవడమే హృద్యం.

2) ఉనికి మరచి, వయసులోనో లేక మతి బ్రష్టుపట్టిన వేళలోనో లేక అందరిని సంతోషపెట్టాలనే ఆలోచనతోనో తప్పులు చేస్తే ఒకనాడు ఈ ఉత్తుత్తి మాటలతో పొందిన ఆనందం కన్నా మనసు వర్షించే రక్తాశ్రువులు నీ ఎద గాయాన్ని గుర్తుచేస్తాయి.

3) గొప్పకో, ఉబ్బితబ్బవ్వో, ప్రతిష్టలకో, కాంక్షకో, అవివేకముతో, అతిగా ఆశపడో లేక మూర్ఖత్వంతో తనని ప్రేమించిన వారి నమ్మకాన్ని భంగపరచే క్రియలు ఏదో ఒక నాడు నీ మనసును, అంతరాత్మను తీవ్రంగా కుదిపేస్తాయి
 

 (PS....రుజుమార్గంలో పయనించు, రంజుగా జీవించు)

No comments: