ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 29 July 2013

 జై షిర్డీ సాయినాధ by విసురజ
పదకొండవ అంకం..

బాబా అనూహ్య లీల..నీళ్ళను నూనేగా మార్చుట
..........................................................
షిర్డీ సాయిబాబాకు దీపాలన్న చాల యిష్టం. ప్రతిరోజు ఊరులోనున్న షావుకార్లను నూనే యాచించి తనుండే మసీదులో రాత్రిపూట దీపాలు వెలిగించుచుండే. షావుకార్లు కొన్నాళ్ళు నూనే యిచ్చిన పిమ్మట ఆ షావుకార్లు అందరూ కూడబలుక్కుని రోజూ నిత్యం ఖరీదుకు కాక వుత్తినే నూనే యివ్వడం దండుగని తలచి బాబాకు నూనే ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. ఎప్పటివలే సాయిబాబా వారి వారి దుకాణాలకు పోగా వారంతా నూనే లేదనిరి. మారు మాటాడక, కలత చెందక, సాయిబాబా మసీదుకు చేరి ప్రమిదలలో వట్టి వత్తులు మాత్రమే పెట్టి, రెండు మూడు మిగులు నూనే చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్ళు పోసి, వాటిని త్రాగి పావనం చేసి, తిరిగి ఆ నీటిని ఆ డోక్కులోకే వుమ్మివేసి ఆ నీటినే సాయిబాబా ప్రమిదలలో పోసేను. వెనకగా నక్కి, సాయిబాబా ఏమి చేస్తారోనని, షావుకార్లు ఆతురుతతో చూస్తుండిరి. దూరంగా వుండి పరీక్షించుచున్న షావుకార్లు ఆశ్చర్యపోయేటట్టు ప్రమిదలన్నీ వెలగడమే కాక తెల్లవార్లు చక్కగ వెలుగే. అంతా చూచినా షావుకార్లు పశ్చాత్తాపపడి, కాళ్ళపై పడి క్షమాపణ కోరిరి. సాయిబాబా వారిని క్షమించి యిహ మీదట మంచిగా నడుచుకొమ్మని హితవు పలికే.

కపట గురువు... జౌహర్ ఆలీ ..కధ
........................................
అహమద్ నగర్ నుంచి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిష్యులతో షిర్డీకి దగ్గరలోనే వున్నా రహాతా అనే వూరు వచ్చేను. ఆటను తన శిష్యులతో వీరభధ్ర మందిరం సమీపాన నున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు; ఖురానంతయు చక్కగా వల్లించగలడు, మధుర భాషణ చతురుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. అట్లా వచ్చిన వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ముస్లిమల పండుగైన ఈదుల్ ఫితర్ నాడు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించు గోడయే "ఈద్ గా". ఆ విషయములో గ్రామస్తుల మధ్యలో కొట్లాట జరిగిన పిమ్మట ఆ మాట గురువు జౌహర్ అలీ రహతా విడిచిపెట్టవలసిన అవసరం ఏర్పడడంతో ఆ మత గురువు జవహర్ అలీ షిర్డీ గ్రామానికి వచ్చి సాయిబాబాతో మసీదులో వుండసాగే. షిర్డీ గ్రామ అమాయకపు ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. జవహర్ ఆలీ షిర్డీ సాయిబాబాను తన శిష్యుడని అందరితో చెప్పువాడు. సాయిబాబా దేనికి అడ్డుచెప్పక ఆయన శిష్యునిలానే సేవలు చేయసాగే. కొంతకాలం పిదప జవహర్ ఆలీ, షిర్డీసాయిబాబా (గురువును శిష్యుడును) రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించే. గురువునకు శిష్యుని శక్తి ఏమి తెలియకపోయినా కాని శిష్యునికి గురువు యొక్క లోపాలు బాగా తెలుసు. ఆన్నీ తెలిసినప్పటికి స్వయం ప్రకటిత గురువు గారిని నెప్పుడు అగౌరవించలేదు. సదరు గురువు గారి పనులన్నియు శిష్యుడిగా మారి షిర్డీసాయి చక్కగా నెరవేర్చుచుండే. వారిరువురు అప్పుడప్పుడు రహతా ఊరునుంచి షిర్డీకి వచ్చి పోవుచుండే. షిర్దీ ప్రజలకు సాయిబాబా అధికంగా రహాతా ఊరులో నుండుట ఎంతమాత్రం యిష్టము లేకుండే. అందుచే వారందరు కలసి రహాతా నుంచి సాయిబాబాను షిర్డీకి తెచ్చుటకు పోయిరి. వాళ్ళకి రహాతా ఊరులో బాబాను "ఈద్ గా" వద్ద కనబడే. వారందరు సాయిబాబాతో మిమ్మల్ని తిరిగి షిర్డీ తీసికొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. అంత, షిర్డీ సాయిబాబా ఇట్లనే "ఫకీరు ముక్కోపి; చెడ్డవాడు, తనను విడిచిపెట్టడు" కనుక ఆ ఫకీరు వచ్చు లోపల వాళ్ళని, తనని తిరిగి తీసుకెళ్ళుటపై ఆశ విడిచి, తిరిగి షిరిడీ వెళ్లిపోవుట మంచిదని సాయిబాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా, సదరు ఫకీరు వచ్చి బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలను మందలించెను. కొంత వివాదం జరిగిన పిమ్మట గురువు గారు, శిష్యుడును తిరిగి షిర్డీ పోవుటకు నిర్ణయం జరిగే.
ప్రజల కోరికపై వారిరువురు షిర్డీ చేరి అచ్చట నివసించుచుండే. సాయిబాబా షిర్డీ ప్రవేశించుటకు 12 సంవత్సరాలు ముందే, దేవీదాసు అనే సాధువు, 10 లేదా 11 ఏండ్ల బాలుడుగా షిర్డీ చేరి మారుతి దేవాలయంలో వుండే. దేవీదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రాలు కలిగి నిర్వ్యామోహిత అవతారమువలే, జ్ఞానిలా కనపడుచుండే. కొంత సమయమైన పిమ్మట దేవీదాసు కపటగురువైన జవహర్ ఆలీని పరీక్షించి అతనిలో అనేక లోపాలున్నాయని కనిపెట్టే. షిర్డీ గ్రామంలో తాత్యా పాటిల్, కాశీనాథు మొదలుగు వారు అనేక మంది దేవీదాసును తమ గురువుగా మన్నించుచుండిరి. వారందరు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తెచ్చిన పిదప జరిగిన ధర్మ మత వాదములలో తగిన సమాధానమివ్వలేక, జవహర్ ఆలీ దేవీదాసు చేతిలో ఓడిపోయి షిర్డీ విడిచి బీజాపూర్ కు పారిపోయే. చాల ఏండ్ల తరువాత పరివర్తన చెందినా పిమ్మట షిర్డీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడే. తాను గురువు, సాయిబాబా శిష్యుడనే అభిప్రాయం వాని మనస్సునుండి తొలగేను. జవహర్ ఆలీ పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వానిని గౌరవంగానే చూచే. ఈ విధముగా బాబా, శిష్యుడు గురువును ఎట్లా కొలువవలెనో ఏ విధంగా అహంకారంను విడిచి గురువుకి శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారంను పొందవలెనో నిరూపించే.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః.
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: