
కవిత : స్నేహం
.....
విరికి తావికి మొహం స్నేహం
తరువుకి లతకి విడదీయలేని స్నేహం
పైరుకి వానకి నీటు స్నేహం
మనసుకి మమతకి పరిమిళించే స్నేహం
తలపుకి మరులకి స్నేహం
ఎదకి మదిగదికి గడియతీసే స్నేహం
కన్నుకి కాంతికి మంచి స్నేహం
స్వప్నాలకు స్వప్నించు హృదికి సుందర స్నేహం
.....
No comments:
Post a Comment