ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 31 July 2013

కవిత: స్వాగతం
.........
మరులు పలికే మదిలోని క్రొంగత్త ఊసులకు స్వప్నాలతో స్వాగతం
తనువు పలికే హృదిలోని తహతహల తాళానికి ప్రేమతో స్వాగతం

కోయిల పలికే క్రొత్త చివురులకు తీపి పాటలతో స్వాగతం
మయూరి పలికే నింగిలోని నీలిమబ్బులకు ఆనంద నర్తనాల స్వాగతం

పండు వెన్నెల పలికే పూర్ణోదయ నిండుజాబిలికి వెలుగుల స్వాగతం
కలికి కన్నుల వెలిగే ప్రేమోదయ మనసుహారతికి ప్రాయాల స్వాగతం

మనసు పలికే మనసైన వాళ్ళకు మనస్ఫూర్తిగా సత్కారాల స్వాగతం
మమత పంచే మధురోహల ఆత్మీయ మహాజనులకు మౌజుల స్వాగతం
....

No comments: