ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 31 July 2013

 జై షిర్డీ సాయినాధ by విసురజ
పదిహేడవ అంకం..


షిర్డీ ప్రయాణ లీల /ధూళిదర్శన మహత్తు....
సాయిబాబా దర్శనానికి షిర్డీ వెళ్ళి రమ్మని మిత్రులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ చాల సార్లు చెప్పినా,, వెళ్లాలని అనుకున్న, అన్నాసాహెబ్ కు వీలవ్వక పోలేదు. ఈ లోగా లోనావోలాలో వుంటున్నా స్నేహితుని కొడుకు జబ్బుపడ్డాడని వాడిన మందులు, వేయించిన మంత్రాలన్నీనిష్ఫలమయ్యేని తెలిసే. తరువాత తమ గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టినా ప్రయోజనం లేకుండే. అప్పుడు నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువుల ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు, వారిన్ నమ్మనేలా నేను షిర్డీ పోనేల?" అని భావించి తన షిర్డీ ప్రయాణం విడనాడే. మిత్రుడైన నానాసాహెబ్ చందోర్కర్ నేను షిర్డీ ప్రయాణం వాయిదా వేయుటపై కోపించే. అందుచే ఆ రాత్రికే షిర్డీ పోవ నిశ్చయించితిని. దాదర్ వెళ్ళి మన్నాడ్ పోయే మెయిల్ (రైలుబండి) సరిగ్గా బయలుదేరేటప్పుడు నేనున్న కంపార్ట్మెంట్లోకి సాయిబోకడు వచ్చి నా వస్తువులను జూచి ప్రయాణ వివరాలడగి వివరాలు తెలిసి, మన్మాడ్ పోవు రైలుబండి దాదర్ లో ఆగదనే విషయం చెప్పి వెంటనే బోరుబందర్ స్టేషనుకు పోమ్మని నాకు సలహా చెప్పే. ఈ చిన్న సాయిలీల వల్ల అదృష్టవశాత్తు సమయానికి షిర్డీ చేరా. అక్కడ సాఠేవాడలో కాకాసాహెబు దీక్షిత్ వేచి వుండే. టాంగా దిగిన వెంటనే నాకు సాయిబాబాను దర్శించుటకు ఆత్రం కలిగే.అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కర్ సాయిబాబా సాఠేవాడా చివరన ఉన్నారని చెప్పి ముందు ధూళి దర్శనం చేసి రమ్మని సలహా యిచ్చే. స్నానానంతరం ఓపికగా మరలా చూడవచ్చుననే. వెంటనే వెళ్లి ధూళి దర్శనం చేసుకొని సాయిబాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయంగా ఆనందం పొంగిపోయే. మిత్రుడు నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికన్నా ఎన్నో రెట్లు ఆనందం అనుభవమైనది. నా సర్వేంద్రయాలు తృప్తి చెంది ఆకలిదప్పికలు మరచితి. సాయిబాబా పాదాలు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నన్ను షిర్డీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితునిగా భావించితిని. వారి ఋణాన్ని నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల మనలో కలుగు చిత్రమైన ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలం తగ్గును. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటి. సాయిబాబాను చూచినంత మాత్రానే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను.

వాదం/వివాదం అలాగే అన్నాసాహెబ్ కి హేమద్ పంత్ నామకరణం....
షిర్డీ చేరిన మొదటిరోజున అన్నాసాహెబ్ కు బాలాసాహెబ్ భాటేకు గురువు యొక్క అవశ్యకతను గూర్చి గొప్ప వాదం/ వివాదం జరిగెను. మన స్వీయ స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నఅన్నాసాహెబ్ వాదించే. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క అవశ్యకత ఏమిటి? తమంతట తామే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకొనవలెనని ఏమీ చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడంటూ నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. బాలసాహెబ్ భాటే మరోమార్గంలో వాదించుచు "కానున్నది కాకమానదు, ప్రారబ్ధం విషయంలో మహనీయులు కూడ ఓడే. మనిషి ఒకటే తలస్తే భగవంతుడు వేరొకటి తలంచు. తెలివితేటలను మాటటుంచు, గర్వం కాని అహంకారము కాని నీకు తోడ్పడవు" ఇట్లా గంట పాటు వాదన జరిగెను. ఈ వాదన వల్ల మా మనశ్శాంతి తప్పినది. చివరకు అందరం శరీర స్పృహ, అహంకారం లేకున్నచో వాదాలకు, వివాదానికి తావులేదని నిశ్చయించితిమి. చివరగా తెలిసిందేమిటంటే అన్నీ వివాదాలకు మూలకారణం అహంకారం. తరువాత అందరం మసీదుకు పోగా, సాయిబాబా కాకాసాహెబ్ ను పిలిచి "సాఠేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదం? అది దేనిని గురించి? అన్నాసాహెబ్ ను చూపుతూ ఈ హేమద్ పంత్ ఏమని పలికెను?" అని అడిగే.. ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాల దూరంగా వున్నది. మరి మా వివాదం గూర్చి సాయిబాబా ఎట్లా తెలిసే? సాయిబాబా సర్వజ్ఞూడై వుండాలి లేనిచో మా వాదన ఎలా తెలిసింది? సాయిబాబా మన అంతరాత్మకి పైఅధికారియై వుండవచ్చును. అలాగే నన్నెందుకు హేమద్ పంత్ అను బిరుదుతో పిలిచెను? అసలు ఈ హేమాద్రిపంతు ఎవరని యోచించే.

హేమాద్రిపంతు నామ విశేష మహిమ..పోలిక, సాయిబాబా ముందుచూపు.....
హేమాద్ పంత్ హేమాద్రిపంతు అను నామానికి మారుపేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంధములను రచించినవాడు; మోడి భాషను కనిపెట్టినవాడు. క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. మరి అన్నాసాహెబ్ ధబోల్కర్ వానికి వ్యతిరేక బుద్ధి గలవాడు. మేధాశక్తి పెద్ద లేనివాడను. మరి నన్ను ఎందుకు అలా అన్నారో తెలియకుండే. ఆలోచన చేయగా నన్ను అహంకారంను చంపుకొమ్మని, అణకువ, నమ్రతలు కలిగి వుండవలెనని సాయిబాబా కోరికకై వుండవచ్చునని గ్రహించితిని. సాఠేవాడలో జరిగిన వివాదములో గెలిచినందులకు సాయిబాబా యీ రీతిగా తెలివికి అభినందనగా అన్నారని అనుకొంటిని. భవిష్యచ్చరితను బట్టి చూడగా బాబా పలుకులకు (దభోల్కరును హేమడ్ పంతు అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తును తెలిసి అలా అన్నారని భావించవచ్చును. ఎందుకనగా హేమద్ పంత్ శ్రీ సాయి సంస్థానంను చక్కని తెలివితేటలతో నడిపించే. లెక్కలను చాల బాగుగనుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయాలతో శ్రీ సాయి సత్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించేను.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: