ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 25 September 2013

1) వెన్నెల వెలుగు కరువైన అమావాస్య నిశిలోను దీపం పెత్తుకుని జీవనం సాగించవచ్చు కానీ ఆశ అడుగంటినా బ్రతుకులో నిత్యం అమావాస్య చీకట్లేగా, మనసా

2) నీ ప్రత్యేక అస్తిత్వం, ఉనికి నీవు నిన్నులా నిలబెట్టుకున్నంతవరకే.. మరోకరిని అనుకరిస్తే నీ సహజ వ్యక్తిత్వం అందరికి అసహజంగా కనబడు, తెలుసుకో మనసా
 


(PS...మోములో మెరుపు ఎరుపు నునుపు పైపై నగషీలే, మనసులో చిత్తశాంతి వుంటే వ్యక్తిత్వమే వెలుగులు విరజిమ్మేగా)

No comments: