ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) బాధాకర విషయాలకు, మానని పాత గాయాలకు భగవంతుడు అందించిన లేపనమే...మ...రు...పు. పాత గాయాలను మరువక, మనిషి జీవనంలో ముందుకు సాగలేడు. బ్రతుకులో గెలువలేడు. అందుకే మరుపు కూడా ఒక్కోమారు వరమవ్వే.

2) మహిలోన మహిళను గౌరవించనివాడు గొప్పవాడు అయినప్పటికీ, మహనీయుడు కాలేడు. మగువ మనసు తెలిసి మెలుగని వాడు మగడైనా, పరాయివాడే, పగవాడే.
 


(PS ...విధి విచిత్రాలు తెలిసుంటే ,జగాన విధి వంచితులు ఉండునా?.)

No comments: