ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైనాలుగవ అంకం
.........................
శ్రీకృష్ణుడు భగవద్గీతలో (9అ. 26శ్లో) చెప్పినదేమిటంటే ఎవరైనా శ్రద్ధాభక్తులతో పత్రం గాని పుష్పం గాని ఫలం గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను. సరిగ్గా అలాగే తన భక్తుడేదైన సమర్పించాలి అనుకుని మరచినచో అట్టివానికి సాయిబాబా జ్ఞాపకం చేసి, అడిగి మరీ దానిని గ్రహించి ఆశీర్వదించేవారు.
అట్లాంటివే, ఈ క్రింద ఉదాహరణలు చూడండి.
1) తర్ ఖడ్ కుటుంబం (తండ్రి, కొడుకు)
ముంబైలోని బాంద్రాలో నివాసం వుండే రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ మొదట్లో ప్రార్థన సమాజస్థుడైనను సాయిబాబాకు ప్రియ భక్తుడు. వాని భార్యాపుత్రులు కూడ సాయిబాబాను పూజించే. ఒకమారు తల్లికొడుకులు షిర్డీకి పోయి వేసవి సెలవులు అక్కడే సాయిబాబా సన్నిధిలో గడుపవలెనని నిర్ణయించే. రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ ప్రార్థన సమాజంకు చెందడంచే ఊరు వదిలి షిర్డీ వెళితే తమ ఇంటివద్ద సాయిబాబాకి పూజ సరిగా జరగకపోవచ్చునని సంశయంతో కొడుకు షిర్డీకి రాననే. అది తెలిసిన వాని తండ్రి రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ తను సాయిబాబా పూజను ఇంట్లో సక్రమంగా చేసెదనని మాట యిస్తే ఆ తల్లికోడుకులు యిరువురు శుక్రవారము రాత్రి బయలుదేరి షిర్డీకి చేరిరి. తల్లికోడుకులు బయలుదేరిన మరునాడు అనగా శనివారమునాడు రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ త్వరగా లేచి స్నానం చేసి, పూజను ప్రారంభించుటకు పూర్వం సాయిబాబా పటమునకు సాష్టాంగనమస్కారం చేసి లాంఛనంగా కాక కొడుకు చేయునట్లు ఇంట్లో పూజను సక్రమంగా చేసి నైవేద్యం నిమిత్తం కలకండను అర్పించే. తదుపరి దానిని అందరికి పంచిపెట్టే. అలాగా ఆనాటి సాయంత్రం, మరుసటిదినం, ఆదివారం, సోమవారం నాడు వరుకు తమ ఇంట్లో సాయిబాబా పూజను క్రమం తప్పక రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ సవ్యంగా చేసే. అతడేప్పుడు యిట్లా సాయిబాబా పూజలను చేసియుండలేదు. రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ పూజలను తన కొడుకిచ్చిన మాట ప్రకారం చేస్తున్నానని సంతసించే.
మంగళవారం నాడు పూజను చేసి ఉద్యోగానికి వెళ్ళే. బాంద్రాలో మంగళవారము 12 గంటలకు రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ తన ఇంటికి మధ్యాహ్నభోజనంకి వచ్చినప్పుడు పూజామందిరంలో తినుటకు ప్రసాదం లేకుండే. తమ నౌకరును ఆ విషయం అడుగా, ఆనాడు రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ ప్రసాదం అర్పించలేదని అందుకే అక్కడ ప్రసాదం లేదని బదులు చెప్పే. ఆ సంగతి తెలిసిరాగానే అపరాధ సాష్టాంగ నమస్కారం చేసి, సాయిబాబాను క్షమాపణ వేడే. పైగా సాయిబాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందకు చింతించి సాయిబాబాను నిందించే. తన పొరపాటును చెబుతూ ఈ సంగతులన్నిటిని షిర్డీలోనున్న తన కొడుకునకు ఉత్తరం వ్రాసి సాయిబాబాను క్షమాపణ వాళ్ళని తన తరుపున వేడమనే.
అదే సమయమందు షిర్డీలో మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు సిద్ధముగానున్నప్పుడు, సాయిబాబా అక్కడ వున్న ఆత్మారాముని భార్యతో "తల్లీ! బాంద్రాలో మీ యింటికి ఏమయిన తినే ఉద్దేశముతో పోతిని. తలుపు తాళము వేసి వున్నా ఎలాగోలా లోపల ప్రవేశించా. కాని అక్కడ తినుటకు ఏమి లేక తిరిగి వచ్చితిని" అని పలికెను.
అమెకు సాయిబాబా మాటలు బోధపడలేదు. కాని ఆమె కుమారుడుకు ఇంటి వద్ద పూజలో ఏదో లోటు జరిగిందని గ్రహించే. వెంటనే యింటికి పోవుటకు అనుమతి సాయిబాబాను వేడే. దానిని సాయిబాబా నిరాకరించి చేసే పూజను షిర్డీలోనే చేయమనే. షిర్డీలో జరిగిన విషయం వెంటనే ఆ పిల్లవాడు తండ్రికి వుత్తరం వ్రాసి ఇంట్లో పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనే.
ఈ రెండు ఉత్తరములు ఒకదానికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానాలు చేరే. ఈ వింత ఆశ్చర్యకరం, సాయిబాబా సర్వజ్ఞతకు నిదర్శనం కదా!

2) ఆత్మారాముని భార్య భక్తిశ్రద్దలు...
పై కధలో చెప్పుకున్న అత్మారాముని భార్య మూడు వస్తువులను సాయిబాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించే.
1. వంకాయ పెరుగు పచ్చడి
2. వంకాయ వేపుడుకూర
3. పేడా.
బాంద్రా నివాసైన రఘువీర భాస్కర పురందరే సాయిబాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు అతను భార్యతో షిర్డీకి బయలుదేరుచుండే. అప్పుడు ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని తెచ్చి మిగుల ప్రేమతో పురంధరుని భార్య చేతికిచ్చి వొక వంకాయతో పెరుగుపచ్చడిని మరి రెండవదానితో వేపుడును చేసి సాయిబాబాకు వడ్డించమని వేడే. షిర్డీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి సాయిబాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసికొనిపోయే. సాయిబాబాకా పచ్చడి చాల రుచించే. కొంచెం తిని మిగతాది అందరికి పంచిపెట్ట్టే. సాయిబాబా వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలననే. అక్కడున్న భక్తులు ఈ సంగతి రాధాకృష్ణమాయికి తెలిపిరి. అది వంకాయల కాలం కాదు గనుక తనకేమి తోచకుండే. వివరాలు ఆడుగా అసలు వంకాయపచ్చడిపురందరుని భార్య కావున వంకాయ వేపుడు గూడ తనే చేసి పెట్టవలెనని తెలిపిరి. అప్పుడు గానీ అందరికీ సాయిబాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలియలేదు. సాయిబాబా సర్వజ్ఞుడని, సర్వ సమర్ధుడని గ్రహించా, అందరాశ్చర్యపడిరి.
1915 డిసెంబరులో గోవింద బలరామ్ మంకడ్ యనువాడు షిర్డీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలెననుకొనే. ప్రయాణంకు ముందు ఆత్మారాముని వద్దకు వచ్చే. అప్పుడు ఆత్మారాం భార్య సాయిబాబాకి ఏమైనా పంపాలాననుకొనే. ఇల్లంతయు వెదక వొక పేడా తప్ప మరేమీ కన్పించలేదు. ఈ పేడా అప్పటికే సాయిబాబాకు నైవేద్యం పెట్టబడే. కాని ఆత్మారాముని భార్యకు సాయిబాబా అందున్న భక్తి ప్రేమలచే ఆ పేడాను అతని ద్వారా సాయిబాబాకు అర్పించే. సాయిబాబా దానిని పుచ్చుకొని తప్పక తినునని నమ్మియుండే. గోవిందుడు షిర్డీ చేరే. సాయిబాబాను దర్శించే. తనతో విశ్రాంతి గది నుండి పేడాను తీసికొని వెళ్ళుట మరచే. సాయబాబా ఊరకుండెను. సాయంత్రం సాయిబాబా దర్శనమునకై వెళ్ళినపుడు కూడ పేడా తీసికొని పోవుట మరచే. అప్పుడు గోవిందుడుని సాయిబాబా తన కొరకేమి తెచ్చావని ఆడగ అతగాడు ఏమి తేలేదని జవాబిచ్చే. వెంటనే సాయిబాబా, "నీవు యింటి దగ్గర బయలుదేరునప్పుడు అత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?"అని ప్రశ్నించే. అప్పుడు గోవిందుడు ఆసలు సంగతి జ్ఞప్తికి దెచ్చుకొని సిగ్గుపడే. వెంటనే గోవిందుడు సాయిబాబాను చేరి క్షమాపణ వేడే. అనుజ్ఞ దొరికిన వెంటనే బసకు పరుగెత్తి పేడాను తెచ్చి సాయిబాబా చేతికిచ్చే. చేతిలో పెట్టిన పేడాను వెంటనే సాయిబాబా గుటుక్కున మ్రింగివేసే. అట్లా ఆత్మారాముని భార్య భక్తిని సాయిబాబా మెచ్చే". శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన "నా భక్తులు నన్ను త్రికరణశుద్దితో నమ్మితే నేను వారిని చేరదీస్తా" అను గీతావాక్యము దృష్టాంతరంగా సాయిబాబాచే నిరూపించబడే.
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: