ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

1) నిటారుగా నిలుచుండే చెట్టే, గాలివానకు త్వరగా నేలకొరుగు...గర్వంతో మిడిసిపడే మడిసే తన మానసిక దౌర్భల్యంతో అదఃపాతాళానికి దిగబడు.

2) తీరం వైపు దూసుకు పోతూ పడిలేచే అలలే జీవిత పాఠం నేర్పేగా ....క్రిందపడినా చతికిలపడరాదని పైకి లేచి తమలా తమ తమ లక్ష్యం వైపు దుమకాలని చాటి చెప్పేగా..
 

 (PS .....తప్పులు చేయడం వింతా కాదు...కొత్తా కాదు...కానీ ఆ తప్పుల నుంచి పాఠములు మరియూ నీతి గ్రహించకపోవడమే వింతవుగా)

No comments: