ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

ఈ ప్రపంచంలో నేనే పునీతుడిని లేక పతిత్తుని అనుకుంటే అంత కన్నా హాస్యస్పదం, మూర్ఖత్వం మరోటి వుంటుందా.. చెప్పెటప్పుడు చెప్పే మాటకు తనకు చెప్పే ఆ అర్హతా వుందా అని జనాలు అలోచిస్తే అస్సలు ముప్పాతిక శాతం మందికి నోరు విప్పే అవకాశం రానే రాదుగా. నేటి మనుషులు సగం సమయం ఉబుసుపోలు కబుర్లుతోను మిగిలిన సగం సమయం వేరివారిపై చాడీలతోనే వ్యయం చేస్తున్నారన్నది కాదనలేని నిజం.

దీనికి ముఖ్య కారణం తన వ్యక్తిగత బాగుపై శ్రద్ద కన్నా మరోకరి ఎదుగదలను నిరసించడం వంకలెతికి ఈసడించడం.. ఇది సబబేనా. ప్రతి ఒక్కరం ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. అలా చేసుకాకపోతే ఒకనాటికి ఇది మానసిక రుగ్మతగా మారే అవకాశముంది, పదిమంది అల వ్యవరించేవారిని అసహ్యించుకునే పూర్తి అవకాశముంది. ఇది ఎవరిని వుద్దేశించి రాయలేదు, తెలిసిన మంచి విషయమని తెలియచేస్తున్నా అంతే సుమా...

No comments: