ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) తగిలిన గాయాన్ని పది మార్లు తలచితే గాయం మానుతుందా..అయ్యిన గాయం మానడానికి, మాయమవ్వడానికి, తిరిగి తగలకుండా వెంటనే తగిన సత్వర చర్యలు తీసుకోవాలి.

2) రోకట్లో దంచేటప్పుడు ఆఖరి పోటుతో దంపదలచినవి దంపబడినా, అంతకు ముందు వేసిన పోట్లన్నీ వృధా అనబడవు..వేసిన మొదటి పోటు నుంచి ఆఖరిదాని దాక ప్రతీ పోటు విలువైనదేగా..నీ గెలుపు విషయంలోను అంతేనని జ్ఞ్యప్తికి వుంచుకో
. ........ విసురజ

(PS.... పనులు చేయక పేరుకై ప్రాకులాడితే అనామకుడుగా మిగిలేవు)

No comments: