ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

 Photo: సాయి నిత్య భజన:
 1.
భజన చేయ రారండి 
సాయిభజన శ్రద్ధతో చేయ రండి 
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి 
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి 

2
తిమిరహరుడే తకదిమిలాడుతూ తప్పిట లాడగ 
లయకారుడే నర్తనలాడుతూ లయగా పాడగ 
వాణినాధుడే పరిపరిమార్లు వల్లెవేయ రచనలు చేయగ 
శ్రీవిభుడే సాయిచరణాలకు సరిగమసంగతుల మాలను కూర్చగ 
ప్రేమతో భజన చేయ రండి 
సాయి భజన శ్రద్ధతో చేయ రండి 

3.  
గురుబోధలే గమ్యము చూపగా 
శ్రద్దా సబూరిలే ముక్తిమార్గము తెలపగా 
సాయిలీలలే నమ్మకము పెంచగా
సద్గురుసాయే సబ్ కా మాలిక్ యని సర్వులు తెలియగా 

ప్రేమతో భజన చేయ రండి 
సాయిభజన శ్రద్ధతో చేయ రండి 

4.  
చేసిన తప్పులే హారతులవ్వగా 
ఈశ అసూయలే దీపాలవ్వగా 
కోరిన కామితాలే ఫలవంతమవ్వగా 
సాయిప్రేమే సర్వదా అనుభూతవ్వగా 

భజన చేయ రారండి 
సాయిభజన శ్రద్ధతో చేయ రండి 
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి 
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి


సాయి నిత్య భజన:
1.
భజన చేయ రారండి
సాయిభజన శ్రద్ధతో చేయ రండి
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి

2
తిమిరహరుడే తకదిమిలాడుతూ తప్పిట లాడగ
లయకారుడే నర్తనలాడుతూ లయగా పాడగ
వాణినాధుడే పరిపరిమార్లు వల్లెవేయ రచనలు చేయగ
శ్రీవిభుడే సాయిచరణాలకు సరిగమసంగతుల మాలను కూర్చగ
ప్రేమతో భజన చేయ రండి
సాయి భజన శ్రద్ధతో చేయ రండి

3.
గురుబోధలే గమ్యము చూపగా
శ్రద్దా సబూరిలే ముక్తిమార్గము తెలపగా
సాయిలీలలే నమ్మకము పెంచగా
సద్గురుసాయే సబ్ కా మాలిక్ యని సర్వులు తెలియగా

ప్రేమతో భజన చేయ రండి
సాయిభజన శ్రద్ధతో చేయ రండి

4.
చేసిన తప్పులే హారతులవ్వగా
ఈశ అసూయలే దీపాలవ్వగా
కోరిన కామితాలే ఫలవంతమవ్వగా
సాయిప్రేమే సర్వదా అనుభూతవ్వగా

భజన చేయ రారండి
సాయిభజన శ్రద్ధతో చేయ రండి
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి

No comments: