ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 25 September 2013

1) పెద్దా చిన్నా తేడాలు వయసుకే గాని విద్యకు వినయానికి లేవు, మనసా.. అందరు తప్పక నేర్వవలసినది విద్యైతే, అందరు తప్పక అలవర్చుకోవలసినది.వినయమేగా, మనసా

2) దేవదానవులు పాలసంద్రం చిలికితే ముందుగా గరళం పలకరించి ఆ తరువాతే అమ్రుతం పలకరించింది మనసా. అలాగే బ్రతుకు జీవన సంద్రాన్ని చిలికినప్పుడు కష్టాలు పలకరించిన తరువాతే సుఖాలు పిలిచి పలకరించుగా, మనసా
 


(PS...ఒకసారి నమ్మకం వమ్ము అయితే, సొమ్ములు ఎంతిచ్చినా తిరిగి నమ్మిక కలుగుతుందా, మనసా)

No comments: