ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 9 September 2013

1) చిత్తడి నేలలో తిరుగాడితే కాళ్ళకు మట్టి అంటకుండా వుంటుందా.. అలాగే నిరాశా, నైరాశ్యపు దారులలో బ్రతుకులీడ్చువారి సాంగత్యంలో వుంటే ఉత్సాహపు నవ్వుల పువ్వులు ఏరుకొనుట దుర్లభమే.
2) పైకం, పదవి, ఐశ్వర్యం, గౌరవం యిత్యాదివి లభించినాకే మహిలో మనిషి నిజస్వరూపం బయటపడే..కాదంటారా
 


(PS..చెడు చెయ్యడం కన్న చెడు సహించడం మరింత గర్హనీయం)

No comments: