
కవిత: ఔను, ప్రేమ మహిమ నిజం కదా!
...................
నీలాకాశంలో వెన్నెలలు కురిసే వేళ
కన్నుల్లో కోరికా కాంతులు తొణకవా
మనసైన కలికి వన్నెలల వల విరిసే వేళ ..
సడి చేసే హృదిలో వలపు మురిపాలు రేగవా ..
తరువులు క్రొత్త చివురులు తొడుగు వేళ..
కూనిరాగాల కోకిలల ఎడద ఆనందగీతి పాడదా..
సుమ దళాలలో క్రొంగొత్త నెత్తావు మధువులు పొంగు వేళ..
మధుదాహంతో భ్రమించే భ్రమరాల దాహార్తి తీరదా..
మది మెచ్చిన లలామ అద్వితీయ అందం..
తను పురుషుడు తప్పక చదవవలిసిన సద్గ్రంధం..
పొంగులు తారాడే వయసుగత్తే సొగసు చూడ
వలపుసీమలో విహరించే మనసు హాయి పొందదా..
ప్రియ సుకుమారి ఓరకంట ప్రేమతో చూడంగా ..
మనఃకడలిలో ఆనందపు అలలు పొంగి పొరలవా
మదినేలే భామినినే ప్రేమమధువు అందించరాగా
వధువై వలపు మనసే వరుడై కళ్యాణఘంటికలు మ్రోగవా
....
విసురజ
No comments:
Post a Comment