ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) కన్నీళ్ళకు కష్టాలకు కృంగి లొంగితే మనసు బక్కచిక్కిపోవు, బ్రతుకు హైరానాగా మిగులు.. కన్నీళ్లు కారక కళ్ళు స్వచ్చమగునా, కష్టాలెరుగక సుఖశాంతుల విలువ తెలియవచ్చునా..

2) పెదవి దాటి మాట రాక మునుపే నీ మనోగతం అవగతం చేసుకుని వెన్నంటి నడిచే తోడు వుంటే, మరింకా ఆలోచనలేలా..చేయిపట్టి సాగక ఆనంద తీరాలు చేరంగా.
 


(Ps: కుళ్ళు, కార్పణ్యాలకు దూరంగా వుంటే మోములో శాంతి, స్వచ్చత ద్యోతకమవ్వు/కానవచ్చు)

No comments: