
కవిత: అవునా/కాదా...గోదావరి
........................
పల్లె పడుచులా గోదావరి
పచ్చని చేల చీరకట్టి నడయాడే వరి
హోరుగా జోరుగా (సాగే) గోదావరి
సరిగమల సంగీతం నేర్పే గోదావరి
మంచైనా చెడైన గోదావరి
అన్నీ మన మంచికే అంటూ పారే గోదావరి
గోదావరి లంకల్లో వంకల్లో
బ్రతుకు నేర్పరిచే/నార్పేసే గోదావరి
దాహంతో నోరెండ గోదావరి
దాహార్తుల దప్పిక తీర్చే తల్లి గోదావరి
కట్టు గట్టు దాటే గోదావరి
కథాకళి చేస్తూ ఉరకలేసే గోదావరి
ఉప్పెనై ఉప్పొంగే గోదావరి
తీరప్రాంతాలకు ముప్పునయ్యే గోదావరి
పండిన బ్రతుకు మండంగా
చివరి మజిలికి సాక్షియయ్యే గోదావరి
చల్లిన చితాభస్మాలే గ్రహించి
అమరజీవికి మోక్షమిచ్చే గోదావరి
మనిషి స్వార్ధమే గోదావరి
అన్నీ అనర్ధాలకూ కారణమా గోదావరి
....
విసురజ
No comments:
Post a Comment